కీలక వడ్డీ రేట్లను మరోసారి పెంచిన RBI.. మరింత భారం కానున్న EMIలు..

Repo Rate: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేపో రేటును పెంచింది.

Arun Chilukuri
Updated on: 5 Aug 2022 1:25 PM IST
RBI Hikes Repo Rate by 50 bps to 5.4%
X

కీలక వడ్డీ రేట్లను మరోసారి పెంచిన RBI.. మరింత భారం కానున్న EMIలు.. 

Repo Rate: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేపో రేటును పెంచింది. బ్యాంకులకు ఇచ్చే నిధులపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి 5 పాయింట్ 40శాతానికి చేర్చినట్లు శుక్రవారం వెల్లడించింది. కోవిడ్ సంక్షోభం తర్వాత ఆర్‌.బి.ఐ వరుసగా మూడోసారి రేపోరేటును పెంచింది. మే నెలలో అనూహ్యంగా సమావేశమై 40 బేసిస్‌ పాయింట్లు జూన్‌ ద్వైమాసిక సమీక్షలో మరో 50 పాయింట్లు పెంచింది.

ఆ భారాన్ని బ్యాంకులు తమ వినియోగదారులకు వెంటనే బదలాయించాయి. తాజా మార్పును ముందే అంచనా వేసిన కొన్ని బ్యాంకులు ఇప్పటికే వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించేశాయి. ఫలితంగా గృహ, వాహన, ఇతర రుణాల నెలవారీ వాయిదాలు మరింత భారం కానున్నాయి. ఈనెల 3న ప్రారంభమైన ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ శుక్రవారం వెల్లడించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story