ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల నియమాలని మార్చిన ఆర్బీఐ.. తెలుసుకోపోతే చాలా నష్టపోతారు..!

RBI has Changed the Rules of Fixed Deposits if you know you Will Lose a Lot
x

ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల నియమాలని మార్చిన ఆర్బీఐ.. తెలుసుకోపోతే చాలా నష్టపోతారు..!

Highlights

Fixed Deposits: మంచి ఆదాయం కోసం చాలామంది ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో పెట్టుబడి పెడతారు.

Fixed Deposits: మంచి ఆదాయం కోసం చాలామంది ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో పెట్టుబడి పెడతారు. కానీ ఆర్బీఐ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల నిబంధనలలో మార్పు చేసింది. అందకే ఈ విషయం ఖాతాదారులు కచ్చితంగా తెలుసుకోవాలి. గత కొన్ని రోజులుగా అనేక ప్రభుత్వ, ప్రభుత్వేతర బ్యాంకులు FDలపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. అందువల్ల ఎఫ్‌డి చేసేముందు కొంచెం తెలివిగా వ్యవహరించండి. మీకు ఈ నియమాలు తెలియకపోతే చాలా నష్టాన్ని భరించవలసి ఉంటుంది.

వాస్తవానికి ఆర్బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD)నిబంధనలలో పెద్ద మార్పు చేసింది. ఇప్పుడు మెచ్యూరిటీ తర్వాత మీరు డబ్బుని క్లెయిమ్ చేయకపోతే దానిపై తక్కువ వడ్డీని పొందుతారు. ఈ వడ్డీ సేవింగ్స్ ఖాతాపై వచ్చే వడ్డీకి సమానంగా ఉంటుంది. ప్రస్తుతం బ్యాంకులు సాధారణంగా 5 నుంచి 10 సంవత్సరాల సుదీర్ఘ కాల వ్యవధి కలిగిన FDలపై 5% కంటే ఎక్కువ వడ్డీని చెల్లిస్తాయి. పొదుపు ఖాతాపై వడ్డీ రేట్లు 3 శాతం నుంచి 4 శాతం వరకు మాత్రమే ఉంటుంది.

ఆర్‌బిఐ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఫిక్స్‌డ్ డిపాజిట్ మెచ్యూర్ అయి ఆ మొత్తాన్ని క్లెయిమ్ చేయకపోతే పొదుపు ఖాతా వడ్డీ లేదా ఎఫ్‌డిపై నిర్ణయించిన వడ్డీ ఈ రెండింటిలో ఏది తక్కువ ఉంటే దానిని చెల్లిస్తారు. ఈ కొత్త నిబంధనలు అన్ని వాణిజ్య బ్యాంకులు, చిన్న ఆర్థిక బ్యాంకులు, సహకార బ్యాంకులు, స్థానిక ప్రాంతీయ బ్యాంకుల డిపాజిట్లపై వర్తిస్తాయి. గతంలో FD మెచ్యూర్ అయి ఆ డబ్బుని విత్‌ డ్రా చేయకపోతే గతంలో చెల్లించే వడ్డీనే కొనసాగించేవారు. కానీ ఇప్పుడు అది జరగదు. మెచ్యూరిటీ తర్వాత డబ్బు విత్‌డ్రా చేయకపోతే దానిపై FD వడ్డీ లభించదు. కాబట్టి మెచ్యూరిటీ అయిన వెంటనే డబ్బు విత్‌డ్రా చేసుకోవడం ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories