Alert: అలర్ట్‌.. మీ జేబులో ఉన్న 500 రూపాయల నోటు నకిలీదా.. నిజమైనదా..!

RBI Guidelines how to Identify Fake 500 RS Currency Note
x

Alert: అలర్ట్‌.. మీ జేబులో ఉన్న 500 రూపాయల నోటు నకిలీదా.. నిజమైనదా..!

Highlights

Alert: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)2021-22 ఆర్థిక సంవత్సరానికి వార్షిక నివేదికను సమర్పించింది.

Alert: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)2021-22 ఆర్థిక సంవత్సరానికి వార్షిక నివేదికను సమర్పించింది. దీని ప్రకారం దేశంలో 500, 2000 రూపాయల నకిలీ నోట్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 500 రూపాయల నకిలీ నోట్లు గతేడాదితో పోలిస్తే 102 శాతం పెరుగుదల సాధించింది. అయితే కాస్త జాగ్రత్తలు పాటిస్తే నకిలీ నోట్ల ఉచ్చులో పడకుండా ఉండవచ్చు. నకిలీ నోట్లను గుర్తించేందుకు ఆర్‌బీఐ 17 పాయింట్ల జాబితాను తెలిపింది. వీటి సహాయంతో మీరు నకిలీ నోట్లను కనిపెట్టవచ్చు. ఆర్బీఐ ఇటీవల నివేదికలో గత సంవత్సరంతో పోలిస్తే 2000 రూపాయల నకిలీ నోట్లు 54.16 శాతం పెరిగాయి. మార్చి 2022 నాటికి దేశంలోని మొత్తం నకిలీ నోట్లలో రూ.500, రూ.2000 నోట్ల వాటా 87.1 శాతం. గతేడాది ఇది 85.7 శాతంగా ఉంది.

500 రూపాయల నోట్లను ఎలా గుర్తించాలి..?

500 రూపాయల నోటు నిజమో కాదో గుర్తించడం చాలా ముఖ్యం. నోటును గుర్తించేందుకు ఆర్బీఐ 17 చిహ్నాలను సూచించింది. ఈ చిహ్నాలను గమనించడం ద్వారా మీరు 500 రూపాయలు లేదా 2000 రూపాయల నిజమైన, నకిలీ నోట్లని గుర్తించవచ్చు. వాటి మధ్య వ్యత్యాసం చాలా చిన్నగా ఉంటుంది. కానీ మీరు శ్రద్ధ వహిస్తే సులువుగా గుర్తిస్తారు.

1. కరెన్సీ నోటు ముందు వైపు ఎడమవైపు అడ్డంగా 500 నెంబర్ కనిపిస్తుంది.

2. దాని పక్కనే 500 నెంబర్ కనిపించకుండా ఉంటుంది. జాగ్రత్తగా గమనిస్తే కనిపిస్తుంది.

3. రెండో గుర్తు పైన దేవనాగరి లిపిలో ₹500 అని కనిపిస్తుంది.

4. కరెన్సీ నోటు మధ్యలో మహాత్మాగాంధీ చిత్రం ఉంటుంది.

5. మహాత్మాగాంధీ చిత్రాన్ని జాగ్రత్తగా గమనిస్తే హిందీలో భారత్, ఇంగ్లీష్‌లో India అనే పదాలు కనిపిస్తాయి.

6. మహాత్మాగాంధీ చిత్రం పక్కన సెక్యూరిటీ త్రెడ్ ఉంటుంది. అందులో భారత్ అని హిందీలో, RBI, 500 అని కనిపిస్తాయి. ఈ సెక్యూరిటీ త్రెడ్ గ్రీన్ నుంచి బ్లూ కలర్‌లోకి మారుతుంది.

7. సెక్యూరిటీ త్రెడ్ పక్కన ఆర్‌బీఐ గవర్నర్ సంతకం ఉంటుంది. సంతకం కింద ఆర్‌బీఐ ఎంబ్లమ్ ఉంటుంది.

8. ఆ పక్కన ఖాళీగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ అందులో మహాత్మాగాంధీ చిత్రంతో పాటు 500 నెంబర్ వాటర్‌మార్క్‌లాగా ఉంటుంది. కాస్త వెలుతురులో పెట్టి చూస్తే ఈ గుర్తులు కనిపిస్తాయి.

9. రూ.500 నోటులో కుడివైపు కింద కరెన్సీ నోట్ సీరియల్ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ సైజు చిన్న నుంచి పెద్దగా ఉంటుంది. ప్రతీ నోటుకు వేర్వేరు నెంబర్లు ఉంటాయి. ఒకే నెంబర్‌తో రెండు నోట్లు ఉండవు.

10. కరెన్సీ నోటు సీరియల్ నెంబర్ పైన రూపీ గుర్తు, 500 నెంబర్‌తో ₹500 కనిపిస్తుంది.

11. రూ.500 నోటులో కుడివైపు కింద అశోక స్తంభం ఉంటుంది.

12. అంధులు కరెన్సీ నోటును గుర్తించేందుకు నల్లని లైన్స్ ఉంటాయి. ఈ లైన్స్ రెండువైపులా కనిపిస్తాయి.

13. కరెన్సీ నోటు వెనుక వైపు ఎడమవైపు కరెన్సీ నోటు ముద్రించిన సంవత్సరం ఉంటుంది.

14. తెల్లని స్పేస్ కింద స్వచ్ఛ్ భారత్ లోగో, నినాదం ఉంటాయి.

15. లాంగ్వేజ్ ప్యానెల్ ఉంటుంది. ఇందులో తెలుగు సహా 15 భాషల్లో రెండు వేల రూపాయలు అని రాసి ఉంటుంది.

16. మధ్యలో ఎర్రకోట చిత్రం ఉంటుంది.

17. ఎడమవైపు పైన దేవనాగరి లిపిలో ₹500 అని కనిపిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories