EPFO: మీరు పీఎఫ్‌ ఖాతాదారులా.. అయితే సమస్యలని ఇలా పరిష్కరించుకోండి..!

Provident Fund Account Related Issues can be Resolved in This way Know the Way
x

EPFO: మీరు పీఎఫ్‌ ఖాతాదారులా.. అయితే సమస్యలని ఇలా పరిష్కరించుకోండి..!

Highlights

EPFO: మీకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌లో (EPFO)ఖాతా ఉంటే ఈ విషయం తెలుసుకోండి.

EPFO: మీకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌లో (EPFO)ఖాతా ఉంటే ఈ విషయం తెలుసుకోండి. ఖాతాదారుల సమస్యలని పరిష్కరించడానికి ఈపీఎఫ్‌వో ఆన్‌లైన్ సౌకర్యాన్ని ప్రారంభించింది. డబ్బులు విత్‌ డ్రా, ఈపీఎఫ్‌ ఖాతా బదిలీ, KYCకి సంబంధించిన సమస్యలు ఉంటే గ్రీవెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ సదుపాయాన్ని పొందండి. ఆన్‌లైన్ పోర్టల్ epfigms.gov.inని సందర్శించడం ద్వారా మీ ఫిర్యాదును నమోదు చేయవచ్చు. ఇది కాకుండా మీరు టోల్ ఫ్రీ నంబర్ 1800-118-005 ద్వారా కూడా ఫిర్యాదును సమర్పించవచ్చు. ఈపీఎఫ్‌వో పోర్టల్‌ని సందర్శించడం ద్వారా మీకు కావాల్సిన సమాచారం తెలుస్తుంది.

మీ ఫిర్యాదు ఇలా నమోదు చేయండి..

1. ఫిర్యాదును నమోదు చేయడానికి epfigms.gov.in పోర్టల్‌కి వెళ్లి 'రిజిస్టర్ గ్రీవెన్స్'పై క్లిక్ చేయండి.

2. ఈపీఎఫ్‌వో డేటాబేస్‌లోని మీ మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీకి OTP వస్తుంది. దానిని మీ వద్ద ఉంచుకోండి.

3. వ్యక్తిగత వివరాలను ఎంటర్‌ చేసిన తర్వాత ఫిర్యాదు చేయడానికి సంబంధించిన PF నంబర్‌పై క్లిక్ చేయండి.

4. గ్రీవెన్స్ కేటగిరీని ఎంచుకుని మీ ఫిర్యాదు వివరాలను అందించండి.

5. ఫిర్యాదు నమోదు సంఖ్య మీ నమోదిత ఈ మెయిల్, మొబైల్ నంబర్‌కు వస్తుంది.

6.epfigms.gov.inలో వ్యూ స్టేటస్ ఆప్షన్‌లో మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడిని నమోదు చేసిన తర్వాత ఫిర్యాదు స్టేటస్‌ కనిపిస్తుంది.

7. ఇది కాకుండా మీరు ఫిర్యాదు గురించి ఏదైనా సమాచారాన్ని ఈపీఎఫ్‌వో ట్విట్టర్ హ్యాండిల్ @socialepfoలో కూడా నమోదు చేయవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories