President Murmu: రాబోయే 25 ఏళ్లు దేశానికి ఎంతో కీలకం.. ప్రస్తుతం ప్రపంచ దేశాలు భారత్‌పై ఆధారపడుతున్నాయి..

Budget 2023: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

Arun Chilukuri
Published on: 31 Jan 2023 12:01 PM IST
President Droupadi Murmu Lays out Vision for Amrit Kaal
X

President Murmu: రాబోయే 25 ఏళ్లు దేశానికి ఎంతో కీలకం.. ప్రస్తుతం ప్రపంచ దేశాలు భారత్‌పై ఆధారపడుతున్నాయి..

Budget 2023: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్‌కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. తన ప్రసంగంతో పార్లమెంట్ సెషన్స్‌ను ప్రారంభించారు. దేశ ప్రగతిలో యువశక్తి, నారీశక్తి భాగస్వామ్యం కావాలన్నారు. పేదరికం లేని భారత్ నిర్మాణం జరగాలని తెలిపారు. రాబోయే 25 ఏళ్లు దేశానికి ఎంతో కీలకమని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించుకుందామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన తొలి ప్రసంగంలో పేర్కొన్నారు.

గతంలో ప్రపంచ దేశాలపై భారత్ ఆధారపడ్డాయని.. కానీ ప్రస్తుతం ప్రపంచ దేశాలు భారత్‌పై ఆధారపడుతున్నాయని రాష్ట్రపతి ముర్ము అన్నారు. దేశ ఉజ్వల భవిష్యత్‌కు ఇది కీలక సమయమన్న.. ముర్ము దేశంలో బలమైన నాయకత్వం ఉందని చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story