మీకు ఆ ఖాతా ఉందా.. ప్రభుత్వం నిబంధనలు మార్చింది..!

PPF Update two or More ppf Accounts Opened After This Date Cannot be Merged
x

మీకు ఆ ఖాతా ఉందా.. ప్రభుత్వం నిబంధనలు మార్చింది..!

Highlights

PPF Account: మీకు పీపీఎఫ్ (పబ్లిక్ ఫ్రావిడెంట్‌ ఫండ్‌) అకౌంట్‌ ఉందా.. అయితే ఈ వార్త కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

PPF Account: మీకు పీపీఎఫ్ (పబ్లిక్ ఫ్రావిడెంట్‌ ఫండ్‌) అకౌంట్‌ ఉందా.. అయితే ఈ వార్త కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. లేదంటే చాలా నష్టపోతారు. పీపీఎఫ్‌ ఖాతాదారులకు ప్రభుత్వం నుంచి ఒక పెద్ద అప్‌డేట్‌ వచ్చింది. ఇది పెట్టుబడిదారులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. డిసెంబర్ 12, 2019 తర్వాత ఒకవ్యక్తి ప్రారంభించిన రెండు లేదా అంతకంటే ఎక్కువ పీపీఎఫ్ ఖాతాలని విలీనం చేయడం సాధ్యం కాదని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి మెమోరాండం (ఓఎం) కూడా జారీ చేసింది.

ఈ మోమోరండం ప్రకారం.. పీపీఎఫ్ ఖాతాలను నిర్వహిస్తున్న సంస్థలు డిసెంబర్ 12న లేదా ఆ తర్వాత తెరిచిన పీపీఎఫ్ ఖాతాల విలీనం కోసం అభ్యర్థనలను పంపకూడదని అందులో ఉంది. దీని వెనుక PPF 2019 సంవత్సరపు నిబంధనల గురించి పేర్కొన్నారు. అలాగే పోస్ట్ ఆఫీస్ జారీ చేసిన సర్క్యులర్‌లో డిసెంబర్ 12, 2019 లేదా తర్వాత తెరిచిన రెండు లేదా అంతకంటే ఎక్కువ పీపీఎఫ్ ఖాతాలలో ఒక ఖాతా మాత్రమే యాక్టివ్‌గా ఉంటుందని చెప్పారు. మిగిలిన ఖాతాలు మూసివేస్తామన్నారు. మూసివేయబడిన ఏ ఖాతాకు వడ్డీ కూడా చెల్లించరని స్పష్టం చేశారు.

ఉదాహరణకు మీరు ఒక PPF ఖాతాను జనవరి 2014లో మరొకటి ఫిబ్రవరి 2020లో తెరిచినట్లయితే ఫిబ్రవరి 2020 నాటి మీ పీపీఎఫ్ ఖాతా మూసివేస్తారు. ఈ ఖాతాపై ఎలాంటి వడ్డీ లభించదు. అదేవిధంగా మీరు మొదటి ఖాతాను జనవరి 2014లో రెండో ఖాతాను ఫిబ్రవరి 2017లో తెరిచి ఉంటే ఈ రెండూ మీ అభ్యర్థనపై విలీనం చేయడానికి అవకాశం ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories