PPF Account: పీపీఎఫ్‌ ఖాతాని ఓపెన్‌ చేశారా.. లేదంటే ఈ ప్రయోజనాలు కోల్పోతున్నట్లే..!

ppf benefits a good corpus can be created through a PPF account
x

PPF Account: పీపీఎఫ్‌ ఖాతాని ఓపెన్‌ చేశారా.. లేదంటే ఈ ప్రయోజనాలు కోల్పోతున్నట్లే..!

Highlights

PPF Account: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా మీ పెట్టుబడిపై మంచి రాబడిని అందించడంతో పాటు మీ డబ్బును నిరంతరం పెంచడానికి సహాయం చేస్తుంది.

PPF Account: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా మీ పెట్టుబడిపై మంచి రాబడిని అందించడంతో పాటు మీ డబ్బును నిరంతరం పెంచడానికి సహాయం చేస్తుంది. అందుకే కచ్చితంగా పీపీఎఫ్ ఖాతా ఓపెన్ చేయాలి. ఈ ఖాతాను భారతీయ పౌరులు ఎవరైనా తెరవవచ్చు. ఇది ప్రజలకు చాలా మంచి పొదుపు ఖాతా అవుతుంది. దీని ద్వారా మంచి కార్పస్‌ను క్రియేట్‌ చేయవచ్చు. PPF ఖాతాల కోసం భారత ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో వడ్డీ రేట్లు జారీ చేస్తుంది. అంటే వడ్డీరేట్లు పెరగవచ్చు లేదా తగ్గించవచ్చు. ప్రస్తుతం PPFఖాతాపై 7.1 శాతం వడ్డీ అందుబాటులో ఉంది. ఇది బ్యాంకులు లేదా పోస్టాఫీసుల ఇతర పెట్టుబడి సాధనాల కంటే చాలా ఎక్కువ.

PPF ఖాతాలో పెట్టుబడి పెట్టిన మొత్తంపై రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. మెచ్యూరిటీ మొత్తంపై కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. PPF ఖాతా పదవీకాలం 15 సంవత్సరాలు. మీరు ఖాతాను మరి కొన్ని రోజులు కొనసాగించాలంటే మరో 5 సంవత్సరాల పాటు పొడిగించే అవకాశం ఉంటుంది. కేవలం రూ. 500తో PPFలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. మీరు ఈ ఖాతాలో ఒక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.5 లక్షలు, నెలకు గరిష్టంగా రూ. 12,500 పెట్టుబడి పెట్టవచ్చు.

ఖాతాదారులు PPF ఖాతాను తెరిచిన మూడు, ఆరు ఆర్థిక సంవత్సరాల మధ్య రుణ సౌకర్యాన్ని పొందవచ్చు. పీపీఎఫ్ ఖాతాలో వచ్చే వడ్డీ కంటే ఒక శాతం ఎక్కువగా రుణంపై వడ్డీ వసూలు చేస్తారు. అందువల్ల, PPF పథకంలో వడ్డీ రేటు మారినప్పుడు, దాని కోసం రుణం వడ్డీ రేటు కూడా మారుతుంది. PPF ఖాతాపై రుణం తీసుకునేటప్పుడు మీరు ఏ ఆస్తిని తాకట్టు పెట్టనవసరం లేదు. ఇందులో బ్యాంకుల నుంచి లభించే వ్యక్తిగత రుణాల కంటే వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories