Post Office: పోస్టాఫీసు సూపర్‌ స్కీం.. ఏప్రిల్‌ నుంచి రెట్టింపు ప్రయోజనం..!

Post Office Monthly Saving Scheme Check for all Details
x

Post Office: పోస్టాఫీసు సూపర్‌ స్కీం.. ఏప్రిల్‌ నుంచి రెట్టింపు ప్రయోజనం..!

Highlights

Post Office: రిస్క్‌ లేని పథకాలలో పెట్టుబడి పెట్టడానికి పోస్టాఫీసు స్కీంలు బెస్ట్‌ అని చెప్పవచ్చు.

Post Office: రిస్క్‌ లేని పథకాలలో పెట్టుబడి పెట్టడానికి పోస్టాఫీసు స్కీంలు బెస్ట్‌ అని చెప్పవచ్చు. ఏప్రిల్‌ నుంచి పోస్టాఫీసు మంత్లీ సేవింగ్స్ స్కీమ్‌లో భాగంగా ఒకే ఖాతాలో రూ.9 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. జాయింట్ ఖాతాలో అయితే రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకం పెట్టుబడి పరిమితిని పెంచారు.

మీరు మంత్లీ సేవింగ్స్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలంటే ఒకేసారి కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. ఈ స్కీమ్ ప్రత్యేకత ఏంటంటే ప్రతి నెలా ఎటువంటి ఇన్‌స్టాల్‌మెంట్‌ను డిపాజిట్ చేయనవసరం లేదు. అంతేకాదు మీరు ప్రతి నెలా వాయిదా రూపంలో వడ్డీని పొందుతారు. డిపాజిట్ చేసిన మొత్తంపై ఈ వడ్డీ చెల్లిస్తారు. ఈ పథకం కింద ప్రతి నెలా డిపాజిట్‌పై 7.1 శాతం వడ్డీని అందిస్తారు. అయితే ఈ స్కీమ్‌లో కేవలం 5 సంవత్సరాలు మాత్రమే పెట్టుబడి పెట్టవచ్చు. 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అసలు మొత్తం తిరిగి చెల్లిస్తారు. ఈ పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలంటే 5 సంవత్సరాల చొప్పున రెండుసార్లు పెంచుకోవచ్చు. అంటే మొత్తం 15 సంవత్సరాల పాటు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

ఒకే ఖాతా: మీరు ఇప్పుడు ఒకే ఖాతాలో రూ. 9 లక్షలు డిపాజిట్ చేస్తే మీకు ప్రతి నెలా 7.1 శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది. అంటే 5 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ.5325 పొందుతారు. ఒక సంవత్సరంలో 63900 రూపాయలు పొందుతారు. 5 సంవత్సరాలలో ఇంట్లో కూర్చొని వడ్డీగా రూ. 319500 పొందుతారు. 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మీరు డిపాజిట్ చేసిన డబ్బును తిరిగి పొందుతారు. ఈ విధంగా మీరు మెచ్యూరిటీపై అసలు మొత్తం, వడ్డీతో పాటు రూ. 1219500 పొందుతారు.

జాయింట్ అకౌంట్: మీరు ఇప్పుడు జాయింట్ అకౌంట్‌లో రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తే ప్రతి నెలా 7.1 శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది. 5 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ.8875 పొందుతారు. ఒక సంవత్సరంలో 106500 రూపాయలు పొందుతారు. 5 సంవత్సరాలలో ఇంట్లో కూర్చొని వడ్డీగా రూ. 532500 పొందుతారు. 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత డిపాజిట్ చేసిన డబ్బును తిరిగి పొందుతారు. ఈ విధంగా మెచ్యూరిటీపై అసలు మొత్తం, వడ్డీతో పాటు రూ. 2032500 పొందుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories