Post Office: మీ డబ్బు రెండింతలు కావాలంటే ఈ ప్రభుత్వ పథకం సూపర్..!

Post Office Kisan Vikas Patra Scheme Super if you Want to Double the Money you have Invested
x

Post Office: మీ డబ్బు రెండింతలు కావాలంటే ఈ ప్రభుత్వ పథకం సూపర్..!

Highlights

Post Office: స్టాక్ మార్కెట్‌లో భారీ ఒడిదుడుకుల మధ్య మీరు సురక్షితమైన పెట్టుబడి పెట్టాలనుకుంటే పోస్టాఫీసు పథకానికి మించింది మరొకటి లేదు.

Post Office: స్టాక్ మార్కెట్‌లో భారీ ఒడిదుడుకుల మధ్య మీరు సురక్షితమైన పెట్టుబడి పెట్టాలనుకుంటే పోస్టాఫీసు పథకానికి మించింది మరొకటి లేదు. ఇక్కడ మీరు జీరో రిస్క్‌తో భారీ లాభాలను పొందవచ్చు. మీరు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్ కింద దీర్ఘకాలిక పెట్టుబడిని కోరుకుంటే పోస్టాఫీసు కిసాన్ వికాస్ పత్ర (KVP) పథకం ఉత్తమమైనది. ఇందులో మీ డబ్బు రెట్టింపు అవుతుంది. ఎటువంటి ప్రమాదం ఉండదు. ఈ సూపర్‌హిట్ పథకం గురించి తెలుసుకుందాం.

కిసాన్ వికాస్ పత్ర పథకం అనేది భారత ప్రభుత్వం పెట్టుబడి పథకం. దీని కింద మీ డబ్బు నిర్ణీత వ్యవధిలో రెట్టింపు అవుతుంది. దేశంలోని అన్ని పోస్టాఫీసులు, పెద్ద బ్యాంకుల్లో ఈ స్కీం అందిస్తున్నారు. దీని మెచ్యూరిటీ కాలం ఇప్పుడు 124 నెలలు. ఇందులో కనీసం 1000 రూపాయలు పెట్టుబడి పెట్టాలి. అయితే దీని కింద గరిష్ట పెట్టుబడిపై పరిమితి లేదు. కిసాన్ వికాస్ పత్ర (KVP) ధృవపత్రాల రూపంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మీరు రూ. 1000, రూ. 5000, రూ. 10,000, రూ. 50,000 ధృవపత్రాల రూపంలో కొనుగోలు చేయవచ్చు.

కావలసిన పత్రాలు

ఈ పథకంలో పెట్టుబడి పరిమితి లేదు. కాబట్టి మనీ లాండరింగ్ ప్రమాదం ఉంది. అందుకే రూ.50,000 కంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం పాన్ కార్డును తప్పనిసరి చేసింది. దీంతో పాటు గుర్తింపు కార్డుగా ఆధార్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇందులో 10 లక్షలు, అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెడితే, మీరు ITR, జీతం స్లిప్, బ్యాంక్ స్టేట్‌మెంట్ రుజువును సమర్పించాలి.

కిసాన్ వికాస్ పత్ర లక్షణాలు

కిసాన్ వికాస్‌ పత్ర పథకంలో అనేక ప్రత్యేకతలు ఉంటాయి. ఇందులో హామీతో కూడిన రిటర్న్‌లు ఉంటాయి. దీనిపై మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావం ఉండదు. ఇందులో వ్యవధి ముగిసిన తర్వాత మీరు పూర్తి మొత్తాన్ని పొందుతారు. ఈ పథకంలో ఆదాయపు పన్ను మినహాయింపు ఉండదు.దీనిపై వచ్చే రాబడి పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. ఈ పథకంలో మీరు 1000, 5000, 10000, 50000 డినామినేషన్లలో పెట్టుబడి పెట్టవచ్చు. మీరు కిసాన్ వికాస్ పత్రాన్ని తాకట్టుగా లేదా సెక్యూరిటీగా ఉంచడం ద్వారా రుణం కూడా తీసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories