PM Kisan: రైతులకి అలర్ట్.. ఇంకా 10 రోజులే గడువు మరిచిపోకండి..!

PM Kisan: రైతులకి అలర్ట్.. ఇంకా 10 రోజులే గడువు మరిచిపోకండి..!
PM Kisan: రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలని అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
PM Kisan: రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ప్రధానమైనది పీఎం కిసాన్ యోజన. ఈ పథకం కింద రైతులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ఏటా రూ.6,000 నేరుగా రైతుల ఖాతాలలో జమచేస్తుంది. 2 వేల రూపాయల చొప్పున ప్రతి నాలుగు నెలలకు ఒక వాయిదా చెల్లిస్తోంది. అయితే ఈ ఆర్థిక సాయం కోసం దేశంలోని రైతులందరు ఒక పనిచేయాల్సి ఉంటుంది. లేదంటే వారికి రూ.2000 అందవు. అదేంటంటే ఈ కేవైసీ చేయడం.
వాస్తవానికి పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులు 31 జూలై 2022లోపు KYCని పూర్తి చేయాల్సి ఉంది. ఈ పని పూర్తి కావడానికి ఇప్పుడు 10 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అర్హులైన రైతులు ఈ పథకం కింద KYC పొందకపోతే పీఎం కిసాన్ రెండు వేల రూపాయలు లభించవు. మోసాలను నిరోధించడానికి ప్రభుత్వం KYC ప్రక్రియను ప్రవేశపెట్టింది. మరోవైపు జులై 31, 2022లోపు KYC చేస్తే అర్హత కలిగిన రైతులు పీఎం కిసాన్ యోజన తదుపరి విడత కింద రూ.2000 పొందుతారు.
ఆన్‌లైన్ eKYC ఈ విధంగా చేయండి..
1.e-KYC కోసం అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ సందర్శించండి. అక్కడ e-kyc ఎంపికపై క్లిక్ చేయండి.
2. ఆధార్ నంబర్‌ని నమోదు చేయండి.
3. ఇప్పుడు మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి OTP అభ్యర్థించండి.
4. తర్వాత వివరాలు పూర్తిగా చెల్లుబాటు అయితే eKYC ప్రక్రియ పూర్తవుతుంది.
5. మరోవైపు ప్రక్రియ సరిగ్గా లేకుంటే కేవైసీ పూర్తికాదు. అప్పుడు మీరు ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించడం ద్వారా సరిదిద్దుకోవచ్చు.
మాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMTTRS Party: ప్రభుత్వ పదవులు సరే.. పార్టీ పదవులు ఎలా...?
17 Aug 2022 3:30 PM GMTMaheswar Reddy: నేను కాంగ్రెస్ లోనే ఉంటా.. రాజీనామా చేయను
17 Aug 2022 7:58 AM GMTతిరుమలలో భారీ వర్షం
17 Aug 2022 7:01 AM GMTRenuka Chowdhury: లీడర్లు కాదు .. క్యాడర్ ముఖ్యం
17 Aug 2022 6:43 AM GMT
AP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTకేంద్ర, రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం
19 Aug 2022 1:30 AM GMTగణేశ్ ఉత్సవాల్లో పౌర విభాగాలతో సమన్వయం
19 Aug 2022 1:14 AM GMTHealth Tips: ఇంగువ ఎక్కువగా తింటే కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లే..!
18 Aug 2022 4:00 PM GMTSleep: రాత్రిపూట ఇవి తింటే మీ నిద్ర సంగతి అంతే..!
18 Aug 2022 3:30 PM GMT