PM Kisan Yojana 22nd Installment: రైతులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరిలోనే పీఎం కిసాన్ 22వ విడత? మీ పేరు లిస్ట్‌లో ఉందో లేదో ఇలా చెక్ చేయండి!

PM Kisan Yojana 22nd Installment: దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan) 22వ విడత నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.

Arun Chilukuri
Published on: 12 Feb 2026 11:48 AM IST
PM Kisan Yojana 22nd Installment: రైతులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరిలోనే పీఎం కిసాన్ 22వ విడత? మీ పేరు లిస్ట్‌లో ఉందో లేదో ఇలా చెక్ చేయండి!
X

PM Kisan Yojana 22nd Installment: దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan) 22వ విడత నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. సాగు ఖర్చుల కోసం ఏటా మూడు విడతల్లో రూ. 6,000 అందిస్తున్న ఈ పథకంలో భాగంగా, తదుపరి రూ. 2,000 నగదును ఫిబ్రవరి నెలలోనే రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అనర్హుల ఏరివేతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారుల జాబితాను ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేస్తోంది. కేవలం చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే ఈ లబ్ధి చేకూరనుంది. ముఖ్యంగా ఒకే కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఇ-కేవైసీ (e-KYC) పూర్తి చేయని వారు, ప్రభుత్వ ఉద్యోగులు, నెలకు రూ. 10 వేల కంటే ఎక్కువ పెన్షన్ పొందే వారు ఈ పథకానికి అనర్హులుగా ప్రకటించబడ్డారు.

స్టేటస్ చెక్ చేసుకునే విధానం: రైతులు తమ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా సులభంగా తమ పేరు జాబితాలో ఉందో లేదో తెలుసుకోవచ్చు:

ముందుగా అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in ఓపెన్ చేయాలి.

హోమ్ పేజీలో 'Know Your Status' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయాలి. (ఒకవేళ నంబర్ తెలియకపోతే 'Know Your Registration Number' ద్వారా తెలుసుకోవచ్చు).

అనంతరం స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా (Captcha) కోడ్‌ను ఎంటర్ చేయాలి.

చివరగా 'Get Data' బటన్ ప్రెస్ చేస్తే, మీ పేమెంట్ స్టేటస్ మరియు అర్హత వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

అధికారిక వెబ్‌సైట్ మాత్రమే కాకుండా, 'PM Kisan' మొబైల్ యాప్ ద్వారా కూడా రైతులు తమ వివరాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవచ్చు. గడువులోగా ఇ-కేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే నిధులు జమ అవుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story