PF ఖాతాదారులకు గుడ్ న్యూస్..! ఇకపై డబ్బు ఉపసంహరణకు ఎలాంటి పత్రాలు అవసరం లేదు

PF ఖాతాదారులకు గుడ్ న్యూస్..! ఇకపై డబ్బు ఉపసంహరణకు ఎలాంటి పత్రాలు అవసరం లేదు
x

PF ఖాతాదారులకు గుడ్ న్యూస్..! ఇకపై డబ్బు ఉపసంహరణకు ఎలాంటి పత్రాలు అవసరం లేదు

Highlights

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన సభ్యులకు శుభవార్త అందించింది. ఇకపై EPF ఖాతా నుంచి డబ్బు ఉపసంహరించుకోవడానికి ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదు. 2017లోనే ప్రవేశపెట్టిన ఒక నిబంధన మేరకు, ఇప్పుడు డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు సెల్ఫ్ డిక్లరేషన్ చాలు.

ఇటీవల పార్లమెంట్‌లో ఈ విషయాన్ని కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, హౌస్ కొనుగోలు, అనారోగ్య పరిస్థితులు వంటి అవసరాలకు డబ్బు అవసరమైనప్పుడు, ఖాతాదారుడు కారణం తెలుపుతూ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వడమే సరిపోతుంది. ఎలాంటి ఆధార పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఇకపై లేదు.

ఈ విషయంపై లోక్‌సభలో ఎంపీలు విజయ్‌కుమార్ విజయ్ వసంత్, మాణికం ఠాగూర్ బి, సురేష్ కుమార్ షెట్ట్కర్ లు ప్రశ్నలు లేవనెత్తారు. వీటికి స్పందనగా, క్లెయిమ్ ప్రక్రియను వేగవంతం చేయడం, పారదర్శకత తీసుకురావడం, వినియోగదారులకు సౌలభ్యం కల్పించడమే ఈ విధానం వెనుక ఉన్న ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది.

2017లో EPFO "కాంపోజిట్ క్లెయిమ్ ఫార్మ్" అనే ఫార్మాట్‌ను ప్రవేశపెట్టింది. దీనివల్ల పాక్షిక లేదా తుది ఉపసంహరణకు డాక్యుమెంట్ల అవసరం లేకుండా చేసారు. అంతేకాదు, గతంలో పాస్‌బుక్ లేదా చెక్కు ఫొటోను అప్‌లోడ్ చేయాల్సిన అవసరం ఉండేది. 2025 ఏప్రిల్ 3 నుండి ఈ నిబంధన కూడా రద్దయింది. ఇది బ్యాంక్ ఖాతా ధృవీకరణలో వచ్చే సమస్యలను తగ్గించింది.

ఇప్పటికే ఈ మార్గదర్శకాలతో 1.9 కోట్లకు పైగా ఖాతాదారులు ప్రయోజనం పొందారని ప్రభుత్వం తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో పత్రాల అవసరం లేకుండానే డబ్బు ఉపసంహరణకు వీలవడం EPF ఖాతాదారులకు నిజమైన ఉపశమనం.

Show Full Article
Print Article
Next Story
More Stories