దేశంలోని మెట్రోనగరాల్లో నిలకడగా పెట్రో ధరలు

Petrol Prices Are Stable in Metro cities India
x

Representational Image

Highlights

* ఆరు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నపెట్రో ధరలు.. * పెట్రోలియం సరఫరా కంపెనీల రోజువారీ ధరల సమీక్ష,, * ఇప్పటికే గరిష్టస్థాయిని తాకిన పెట్రో ధరలు..

దేశంలోని మెట్రోనగరాల్లో పెట్రో ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి.గత ఆరు రోజులుగా పెట్రో ధరలు స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటికే గరిష్టస్థాయిని తాకాయి పెట్రోలియం సరఫరా కంపెనీల రోజువారీ ధరల సమీక్ష ఫలితంగా రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 86 రూపాయల 30 పైసలు, డీజిల్ 76 రూపాయల 48 పైసలు వద్దకు చేరాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 89రూపాయల 77 పైసలు డీజిల్ ధర లీటర్‌ 83 రూపాయల 46 పైసలు వద్ద కొనసాగుతున్నాయి. కాగా తాజా బడ్జెట్ లో అగ్రి సెస్సు విధించినప్పటికీ దాని భారం వినియోగదారులపై వుండబోదంటూ హామీ ఇచ్చిన కేంద్రం సెస్‌ల భారాన్ని సుంకం నుంచి మినహాయిస్తామని ఫలితంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు యథాతధంగా ఉంటాయని స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories