దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు స్థిరం

* గత మూడురోజులుగా నిలకడగా పెట్రో ధరలు .. * అయితే ఇప్పటికే గరిష్టస్థాయిని తాకి పరుగులు.. * పెట్రోలియం కంపెనీల రోజువారీ ధరల సమీక్ష..

Sandeep Eggoju
Published on: 30 Jan 2021 10:12 AM IST
Petrol prices are stable in metro cities in India
X

Representational Image

దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి గత మూడురోజులుగా నిలకడగా పెట్రో ధరలు కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటికే గరిష్టస్థాయిని తాకాయి పెట్రోలియం కంపెనీల రోజువారీ ధరల సమీక్ష ఫలితంగా పెట్రో రేట్లు చాలా నగరాల్లో రికార్డు స్థాయికి చేరుకున్నాయి.. రాజస్థాన్ లోని శ్రీగంగనగర్ లో పెట్రోల్ ధర లీటరుకు 101 రూపాయలకు చేరగా అదే సమయంలో ఆర్ధిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు 93 రూపాయలకు చేరుకుంది రాజధాని డిల్లీలో పెట్రోల్ లీటరు ధర 86 రూపాయల మార్క్ ను దాటి పరుగులు తీస్తోంది ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 86 రూపాయల 30 పైసలు, డీజిల్ 76 రూపాయల 48 పైసలు వద్దకు చేరాయి హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 89రూపాయల 77 పైసలు..డీజిల్ ధర లీటర్‌ 83 రూపాయల 46 పైసలు వద్ద కొనసాగుతున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story