Petrol Price: స్థిరంగా కొనసాగుతోన్న పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol Price: వివిధ నగరాల్లో పెట్రోల్ ధలు ఇవిధంగా ఉన్నాయి.

Samba Siva Rao
Updated on: 24 March 2021 9:48 AM IST
Petrol Price Stable In Indian Metro Cities
X

 పెట్రో ధరలు

Petrol Price: దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రో ధరలు స్థిరంగా నిలకడగా కొనసాగుతున్నాయి. గత ఫిబ్రవరి 27న పెట్రో ధరలను సవరించగా అప్పట్నుంచి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కీలక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నేపధ్యంలో.. పెట్రో ధరల రోజువారీ సమీక్ష జరపడం లేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఏదేమైనా ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు నెలల వ్యవధిలో పెట్రోల్ రేటు లీటర్ కు 4 రూపాయల 87 పైసలు.. డీజిల్ 4 రూపాయల 99 పైసల మేర పెరిగింది. రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 91 రూపాయల 17పైసల వద్ద స్థిరంగా కొనసాగుతుండగా.. ఆర్దిక రాజధాని ముంబై లో 97 రూపాయల 57 పైసల వద్దకు చేరింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 94 రూపాయల 79 పైసలు.. ఏపీలోని మెట్రో నగరాల్లో 97 రూపాయల 24 పైసలు వద్ద కొనసాగుతున్నాయి.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story