Petrol Rate: దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రో ధరలు స్థిరం

Petrol Rate: రెండు వారాలుగా స్థిరంగా, నిలకడగా పెట్రో ధరలు ఇప్పటికే సరికొత్త గరిష్టానికి చేరిన పెట్రో ఉత్పత్తుల ధరలు

Sandeep Eggoju
Updated on: 13 March 2021 6:13 PM IST
Petrol Price Stable In Indian Metro Cities
X

Representational Image

Petrol Rate: దేశంలో పెట్రోల్ ,డీజిల్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. దేశంలోని మెట్రో నగరాల్లో గత రెండు వారాలుగా పెట్రో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చివరిసారిగా ఫిబ్రవరి 27 న పెట్రో ధరలను సవరించగా ఈ ఏడాది రెండు నెలల వ్యవధిలో పెట్రోల్ రేటు లీటర్ కు 4 రూపాయల 87 పైసలు డీజిల్ లీటర్ కు 4 రూపాయల 99 పైసల మేర పెరగడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 91 రూపాయల మార్క్ వద్దకు చేరగా ఆర్దిక రాజధాని ముంబై లో 97 రూపాయల ఎగువకు చేరి పరుగులు పెడుతోంది.తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 94 రూపాయల 79 పైసలు ఏపీలోని మెట్రో నగరాల్లో 87 రూపాయల 24 పైసలు వద్ద కొనసాగుతున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story