Petrol Rate: దేశంలోని మెట్రోనగరాల్లో స్థిరంగా

Petrol Rate: సరికొత్త గరిష్టానికి చేరిన పెట్రో ఉత్పత్తుల ధరలు * మంగళవారం రోజు 35 పైసలు పెరిగిన పెట్రో ధరలు

Sandeep Eggoju
Published on: 24 Feb 2021 9:55 AM IST
Petrol Price Stable in Indian Metro cities
X

Representational Image

Petrol Rate: దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రో ధరలు స్థిరంగా, నిలకడగా కొనసాగుతున్నాయి. పెట్రోలియం సరఫరా కంపెనీల రోజువారీ ధరల సమీక్ష ఫలితంగా మంగళవారం మెట్రోనగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు 35 పైసలు చొప్పున పెరిగాయి. ఫలితంగా దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 91 రూపాయల మార్క్ కు చేరువ కాగా.. ఆర్దిక రాజధాని ముంబై లో 97 రూపాయల ఎగువకు చేరి పరుగులు పెడుతోంది. మరోవైపు రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే పెట్రోల్ ధర సెంచరీ దాటి 101 రూపాయల 59 పైసలు వద్దకు చేరింది.

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 90 రూపాయల 93 పైసలు, డీజిల్ 81 రూపాయల 32 పైసలు వద్దకు చేరాయి. ముంబై లో లీటర్ పెట్రోల్ ధర 97 రూపాయల 34 పైసలు వద్దకు చేరింది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 94 రూపాయల 54 పైసలు.. డీజిల్ 88 రూపాయల 69 పైసలు వద్ద కొనసాగుతున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story