Petrol and Diesel Prices Today: మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

*హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు 37 పైసలు పెంపు *హైదరాబాద్‌లో లీటరు డీజిల్‌పై 38 పైసలు

Shilpa
Updated on: 23 Oct 2021 11:21 AM IST
Petrol Price in Hyderabad Mumbai Delhi Kolkata Chennai Diesel Price Today 23 10 2021
X

మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు(ఫోటో- ది హన్స్ ఇండియా)

Petrol and Diesel Prices Today: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి పెరిగాయి. చమురు కంపెనీలు వరుసగా నాలుగో రోజూ లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై 35 పైసల చొప్పున వడ్డించాయి. దీంతో ఢిల్లీలో పెట్రోల్‌ ధర 107.24కి చేరగా, డీజిల్‌ ధర 95.97కు పెరిగింది. ఇక ముంబైలో పెట్రోల్‌ 113.12, డీజిల్‌ 104కు పెరిగింది. కోల్‌కతాలో పెట్రోల్‌ 107.78, డీజిల్‌ 99.08, చెన్నైలో పెట్రోల్‌ 104.22, డీజిల్‌ 100.25కి చేరాయి.

తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు 37 పైసలు అధికమై 111.55కి చేరగా, డీజిల్‌పై 38 పైసలు అధికమై 104.70కు పెరిగింది. కాగా, వరుసగా నాలుగు రోజులుగా పెట్రో ధరలు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో నాలుగు రోజుల వ్యవధిలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 1కిపైగా పెరిగాయి. గత నెల 28 నుంచి ఈ నెల 23 వరకు 20 సార్లు పెట్రోల్‌ ధరలు పెరిగాయి.



Shilpa

Shilpa

Next Story