మెట్రోనగరాల్లో పెట్రో ధరలు ఆల్ టైమ్ హై

* సరికొత్త రికార్డ్ సృష్టిస్తున్న పెట్రోల్ ధరలు * సోమవారం నిలకడగా పెట్రో ఉత్పత్తుల ధరలు * ముంబై లో 93 రూపాయల ఎగువన లీటర్ పెట్రోల్ ధర

Sandeep Eggoju
Published on: 8 Feb 2021 9:38 AM IST
Petrol Price Hike In Indian Metro cities
X

Representational Image

దేశంలోని మెట్రోనగరాల్లో పెట్రో ధరలు ఆల్ టైమ్ హై కి చేరి సరికొత్త రికార్డ్ సృష్టిస్తున్నాయి వారం రోజులుగా పెట్రో ధరలు పరుగులు పెడ్తున్న నేపధ్యంలో పెట్రోలియం కంపెనీలు సోమవారం పెట్రోల్-డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పు చేయలేదు. అయితే దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు ఈ ఏడాదిలో ఇప్పటికే మూడు రూపాయల మేర పెరిగి చుక్కలనంటుతున్నాయి.

రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 86 రూపాయల 95 పైసలు, డీజిల్ 77 రూపాయల 13 పైసలు వద్దకు చేరాయి. ఆర్దిక రాజధాని ముంబై లో లీటర్ పెట్రోల్ ధర 93 రూపాయల 49 పైసలుగా నమోదవుతోంది ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 90 రూపాయల 42 పైసలు, డీజిల్ 84 రూపాయల14 పైసలు వద్ద కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగినప్పటికీ దేశీయంగా పెట్రోల్ డీజిల్ నిలకడగా స్థిరంగా కొనసాగుతున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story