మెట్రోనగరాల్లో నిలకడగా పెట్రో,డీజిల్ ధరలు..
మెట్రోనగరాల్లో పెట్రో, డీజిల్ ధరలు వరుసగా ఎనిమిదో రోజు నిలకడగా కొనసాగుతున్నాయి. ఇంధన ధరలు ప్రస్తుతం స్థిరంగా వుండటంతో వాహనదారులకు ఉపశమనం లభించినట్లయింది. రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 83 రూపాయల 71 పైసలుగా వుండగా, డీజిల్ ధర 73.87 గా నమోదయ్యాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 87రూపాయల 06 పైసలు, డీజిల్ ధర లీటర్ 80.60 పైసల వద్ద కొనసాగుతున్నాయి. గత నెల 20 వ తేదీ నుంచి 17 సార్లు పెట్రో ధరలను సవరించడంతో లీటర్ పెట్రోల్ పై 2 రూపాయల 65 పైసలు, డీజిల్ పై 3 రూపాయల 40 పైసలు చొప్పున భారం పడినట్లయింది. ఫలితంగా సెప్టెంబర్ 2018 నాటి స్థాయిలో పెట్రో ధరల భగభగలు కొనసాగుతున్నాయి.
Next Story




