దేశంలోని మెట్రోనగరాల్లో ఇంధన ధరలు యధాతధం..

Arun Chilukuri
Updated on: 14 Dec 2020 11:42 AM IST
దేశంలోని మెట్రోనగరాల్లో ఇంధన ధరలు యధాతధం..
X

దేశంలోని మెట్రోనగరాల్లో ఇంధన ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. వరుసగా ఏడో రోజు భారత చమురు సంస్థలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను యధాతధంగా ఉంచాయి. గతవారంలో నిరాటంకంగా పరుగులు తీసిన పెట్రో ధరలు తాజా వారంలో స్థిరంగా కొనసాగుతుండటంతో వాహనదారులకు ఉపశమనం లభించినట్లయింది. రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర 83 రూపాయల 71 పైసలుగా ఉండగా డీజిల్‌ ధర 73.87 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అదే విధంగా హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 87 రూపాయల 06 పైసలు డీజిల్ ధర లీటర్‌ 80.60 పైసల వద్ద కొనసాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధరల పరుగులు కొనసాగుతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story