దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు స్థిరం..

Arun Chilukuri
Published on: 12 Jan 2021 10:48 AM IST
Petrol and diesel prices in Hyderabad, Delhi today remains steady
X

దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ, దేశీయ మార్కెట్లో చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఇప్పటికే పెట్రో ధరలు ఆల్ టైమ్ హై వద్ద కొనసాగుతున్న నేపధ్యంలో వరుసగా ఐదో రోజు పెట్రో ధరలు యథాతధంగా కొనసాగుతున్నాయి. రాజధాని డిల్లీలో పెట్రోల్ లీటరు ధర 84 రూపాయల 20 పైసలు, డీజిల్ 74 రూపాయల 38 పైసలు వద్దకు చేరాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 87రూపాయల 59 పైసలు డీజిల్ ధర లీటర్‌ 81 రూపాయల 17 పైసలు వద్ద కొనసాగుతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story