పెట్రో ధరల మోత

Arun Chilukuri
Updated on: 1 March 2021 12:47 PM IST
పెట్రో ధరల మోత
X

పెట్రో ధరల మోత

దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రో ధరలు స్థిరంగా, నిలకడగా కొనసాగుతున్నాయి. పెట్రోలియం సరఫరా కంపెనీల రోజువారీ ధరల సమీక్ష లో భాగంగా వారాంతాన పెట్రోల్ ,డీజిల్ ధరలు 15 నుంచి 24 పైసలు చొప్పున పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 91 రూపాయల మార్క్ ఎగువన కొనసాగుతుండగా ఆర్దిక రాజధాని ముంబై లో 97 రూపాయల ఎగువకు చేరి పరుగులు పెడుతోంది. మరోవైపు రాజస్థాన్ , మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే పెట్రోల్ ధర సెంచరీ దాటి 101 రూపాయల 59 పైసలు వద్దకు చేరింది. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 91 రూపాయల 17 పైసలు, డీజిల్ 81 రూపాయల 47 పైసలు వద్దకు చేరాయి. ముంబై లో లీటర్ పెట్రోల్ ధర 97 రూపాయల 57 పైసలు వద్దకు చేరింది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 94 రూపాయల 79 పైసలు, డీజిల్ 88 రూపాయల 86 పైసలు వద్ద కొనసాగుతున్నాయి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story