మెట్రోనగరాల్లో పెట్రో ధరలు ఆల్ టైమ్ హై..

Arun Chilukuri
Published on: 11 Feb 2021 4:24 PM IST
మెట్రోనగరాల్లో పెట్రో ధరలు ఆల్ టైమ్ హై..
X

మెట్రోనగరాల్లో పెట్రో ధరలు ఆల్ టైమ్ హై..

దేశంలోని మెట్రోనగరాల్లో పెట్రో ధరలు ఆల్ టైమ్ హై కి చేరి సరికొత్త రికార్డ్ సృష్టిస్తున్నాయి. వరుసగా మూడో రోజు ఇంధన ధరలు పెరిగి కొత్త గరిష్ఠాలను తాకాయి. పెట్రోలియం కంపెనీలు తాజాగా పెట్రోల్ పై 25 పైసలు, డీజిల్ పై 30 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 87 రూపాయల 85 పైసలు, డీజిల్ 78 రూపాయల 03 పైసలు వద్దకు చేరాయి. ఆర్దిక రాజధాని ముంబై లో లీటర్ పెట్రోల్ ధర 94 రూపాయల 36 పైసలుగా నమోదవుతోంది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 91 రూపాయల 35 పైసలు డీజిల్ 85 రూపాయల 11 పైసలు వద్ద కొనసాగుతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story