దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరల మోత ..

Arun Chilukuri
Published on: 23 Jan 2021 2:54 PM IST
దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరల మోత ..
X

దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరల మోత ..


దేశంలో పెట్రోల్ ధరలు మరో మారు పెరిగి మోత మోగిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా ప్రతిరోజు పెరుగుతూ వస్తున్న పెట్రో ధరలు వారాంతాన మరింతగా పెరిగాయి. మెట్రో నగరాల్లో పెట్రోల్ పై 22 నుంచి 25 పైసలు, డీజిల్ పై 18 నుంచి 26పైసలు చొప్పున పెరిగాయి. ఫలితంగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఆర్దిక రాజధాని ముంబైలోనూ పెట్రో ధరలు ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిని తాకాయి. రాజధాని డిల్లీలో పెట్రోల్ లీటరు ధర 85 రూపాయల మార్క్ ను దాటి పరుగులు తీస్తోంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 85 రూపాయల 70 పైసలు, డీజిల్ 75 రూపాయల 88 పైసలు వద్దకు చేరాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 89రూపాయల 15 పైసలు డీజిల్ ధర లీటర్‌ 82 రూపాయల 80 పైసలు వద్ద కొనసాగుతున్నాయి.
Arun Chilukuri

Arun Chilukuri

Next Story