Petrol And Diesel Rates: స్థిరంగా కొనసాగుతోన్న పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol And Diesel Rates: కొన్ని రోజులుగా ఇంధన ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి.

Kranthi
Updated on: 15 April 2021 1:37 PM IST
Petrol and Diesel Prices 15-04-2021
X

Petrol And Diesel Rates:(File Image)

Petrol And Diesel Rates: అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు భారీగా దిగి వస్తున్నప్పటికీ ఆ మేరకు భారత్ లో పెట్రోల్ ధరలు మాత్రం తగ్గడం లేదు. భారత్‌ లో పెట్రోల్, డీజిల్ ధరలు గత కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. గతంలో పలు రాష్ట్రాల్లో లీటర్‌ పెట్రోల్ ధర ఏకంగా రూ.100 మార్క్ కూడా దాటింది. మరికొన్ని చోట్ల వందకు చేరువైంది. దీంతో వాహనాలను బయటకు తీసేందుకు యజమానులు భయపడ్డారు. ఈ సమయంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత కనపించింది. ఓ వైపు ప్రజలు, మరోవైపు విపక్షపార్టీలు ఆందోళన వ్యక్తంచేశాయి. కారణాలు ఏమైనప్పటికీ.. కొన్ని రోజులుగా ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి.

వివిధ నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.56 ఉండగా, డీజిల్‌ ధర రూ.80.87 గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్‌ ధర రూ.96.98 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.96 గా ఉంది. చెన్నైలో పెట్రోల్‌ ధర రూ.92.71 ఉండగా, డీజిల్‌ ధర రూ.86.01గా ఉంది. బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.93.59 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.75 గా ఉంది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.77, డీజిల్‌ ధర రూ.83.75 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.93.99 ఉండగా, డీజిల్‌ ధర రూ.88.05 గా ఉంది. వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.74 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.80 ఉంది. కరీంనగర్‌లో పెట్రోల్‌ రూ.94.42 ఉండగా, డీజిల్‌ ధర రూ.88.44 గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌ విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.56 ఉండగా, డీజిల్‌ ధర రూ.90.06 గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్‌ ధర రూ.96.39 గా ఉండగా, డీజిల్‌ ధర రూ.89.87గా ఉంది. విజయనగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.95.85 గా ఉండగా, డీజిల్‌ ధర రూ.89.37గా కొనసాగుతున్నాయి.

Kranthi

Kranthi

Next Story