Petrol and Diesel Price Hike: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు...

Petrol and Diesel Price Hike: ఆరు రోజుల వ్యవధిలో ఐదుసార్లు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు...

Shireesha
Published on: 27 March 2022 11:51 AM IST
Petrol and Diesel Price Hike by 50 Paisa Today 27 03 2022 | Live News
X

Petrol and Diesel Price Hike: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు...

Petrol and Diesel Price Hike: మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 50 పైసలు, డీజిల్‌పై 55 పైసలు పెంచాయి ఆయిల్‌ కంపెనీలు. దీంతో.. ఆరు రోజుల వ్యవధిలో ఐదుసార్లు చమురు ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ 112 రూపాయల 37 పైసలు కాగా.. డీజిల్‌ లీటర్‌ 98 రూపాయల 70 పైసలకు చేరింది. ఇక.. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ 114 రూపాయల 36 పైసలు, డీజిల్‌ వంద రూపాయల 33 పైసలకు పెరిగింది.

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 99 రూపాయల 11 పైసలు, డీజిల్ 90 రూపాయల 42 పైసలు, ముంబైలో లీటర్ పెట్రోల్ 113 రూపాయల 88 పైసలు, డీజిల్ 98 రూపాయల 13 పైసలు, చెన్నైలో లీటర్ పెట్రోల్ 104 రూపాలయ 90 పైసలు, డీజిల్ 95 రూపాయలు, కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ 108 రూపాయల 53 పైసలు, డీజిల్ 93 రూపాయల 57 పైసలు గా ఉంది.

Shireesha

Shireesha

Next Story