Nokia Denies Smartphone Fake News: సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు..కొట్టిపారేసిన నోకియా

Nokia Denies Smartphone Fake News: సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు..కొట్టిపారేసిన నోకియా
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

Nokia Denies Fake News: ప్రతి మనిషి జీవితంలో ఫోన్ ఒక భాగమైంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఈ ఫోన్లలో ఎన్నో నోటిఫికేషన్లు, మెసేజ్ లు, వార్తలు వస్తుంటాయి.

Nokia denies fake news : ప్రతి మనిషి జీవితంలో ఫోన్ ఒక భాగమైంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఈ ఫోన్లలో ఎన్నో నోటిఫికేషన్లు, మెసేజ్ లు, వార్తలు వస్తుంటాయి. అయితే వాటిలో కొన్ని నిజం ఉంటే కొన్ని ఫేక్ వార్తలు ఉంటాయి. ఈ ఫేక్ వార్తలు కూడా నిజం అన్నట్టుగానే పోస్ట్ చేస్తారు. అయితే కొంత మంది ఈ వార్తలను చూసి నిజం అనుకుని మోసపోతున్నారు. ఇలా చాలా సంఘటనలే జరిగాయి. ఇప్పుడు తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త విస్తృతంగా ప్రచారం అవుతుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో విద్యార్థులకు, కార్మికులకు ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ ఉచితంగా స్మార్ట్ ఫోన్లను అందిస్తుందంటూ ఫేక్ వార్తలు వస్తున్నాయి. సుమారు 20,000 కొత్త ఫోన్లను నోకియా అందజేయనున్నదని, ఫోన్‌ను గెల్చుకోవాలంటే కామెంట్‌ సెక్షన్‌లో 'ఎన్‌' అని టైప్‌ చేయాలని పోస్ట్‌ చేస్తున్నారు. దీంతో ఈ వార్త నెటిజన్లఫోన్లలో చక్కర్లు కొడుతూ విస్తృతంగా ప్రచారమవుతున్నది.

ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఈ ప్రకటనకు, తమ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని స్పస్టం చేసింది. ఇది అవాస్తవ వార్త అని కొట్టిపారేసింది. ఉచితంగా ఫోన్లు అందజేయనున్నట్లు ఎలాంటి ప్రకటన తమ కంపెనీ చేయలేదని తేల్చి చెప్పింది. అయితే గతేడాది అక్టోబర్‌ 17 నుంచి నవంబర్‌ 7 మధ్య మొబైల్ తయారీ సంస్థ తమ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఒక పోటీ నిర్వహించింది. ఆ పోటీలో పాల్గొని విజేతలైన వారికి నోకియా 7.2 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను అందజేసింది. అయితే దాన్నే ఆధారంగా చేసుకుని ప్రస్తుతం కొంత మంది ఆకతాయిలు ఇలాంటి ప్రచారాలు కొనసాగిస్తున్నారని తెలిపింది. ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మవద్దని, ఏదైనా కాంటెస్టులు, స్కీంలు ఉంటే తమ అధికారిక వెబ్ సైట్లో పొందుపరుస్తామని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories