RTO Office: డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేస్తున్నారా.. కొత్త నిబంధన ఏంటంటే..?

No Need to go to RTO Office for Driving License know the New Rule
x

RTO Office: డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేస్తున్నారా.. కొత్త నిబంధన ఏంటంటే..?

Highlights

RTO Office: డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకునేవారికి కేంద్ర ప్రభుత్వం కొంత ఉపశమనం కల్పించింది.

RTO Office: డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకునేవారికి కేంద్ర ప్రభుత్వం కొంత ఉపశమనం కల్పించింది. ఇప్పుడు శుభవార్త ఏంటంటే మీరు డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి RTO ఆఫీసుని సందర్శించాల్సిన అవసరం లేదు. అంతేకాదు డ్రైవింగ్ పరీక్ష లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్‌ని పొందవచ్చు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన కొత్త నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన డ్రైవింగ్ శిక్షణ కేంద్రం సహాయంతో డ్రైవింగ్ లైసెన్స్‌ను పొందవచ్చు. దీని కోసం అభ్యర్థి డ్రైవింగ్ శిక్షణా కేంద్రం నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. తర్వాత అర్హులైన అభ్యర్థులకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ అవుతుంది.

దీనివల్ల ప్రజలు ఆర్‌టీఓ ఆఫీసు వద్దకు వెళ్లి డీఎల్‌ తీసుకోవడానికి క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. కేంద్ర, రాష్ట్ర రవాణా శాఖ ఇటువంటి శిక్షణా కేంద్రాలను నిర్వహిస్తోంది. డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే వారు గుర్తింపు పొందిన శిక్షణా కేంద్రంలో పేరు నమోదు చేసుకోవాలి. వారు నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. అభ్యర్థి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత శిక్షణా కేంద్రం సర్టిఫికేట్ జారీ చేస్తుంది. సర్టిఫికేట్ పొందిన తర్వాత అభ్యర్థులు డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత ఎటువంటి పరీక్ష లేకుండానే శిక్షణా ధృవీకరణ పత్రం ఆధారంగా RTO లైసెన్స్ జారీ చేస్తుంది.

శిక్షణా కేంద్రాలలో సిమ్యులేటర్లు, డెడికేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ ఉంటాయి. ఇందులో ఉత్తీర్ణత సాధించగలిగిన వారికి RTO ఆఫీసుకి రాకుండా లైసెన్స్ జారీ అవుతుంది. గుర్తింపు పొందిన శిక్షణా కేంద్రాలు లైట్ మోటార్ వెహికల్స్ (LMV), మీడియం, హెవీ వెహికల్స్ (HMV) కోసం శిక్షణను అందించగలవు. LMV డ్రైవింగ్‌ కోసం నాలుగు వారాల శిక్షణ ఉంటుంది. ఆ తర్వాత డ్రైవింగ్‌ టెస్ట్‌ పాస్‌ కావాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories