ITR Rules: అమ‌ల్లోకి కొత్త ఐటీఆర్ నిబంధ‌న‌లు.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే.

ITR Rules: అమ‌ల్లోకి కొత్త ఐటీఆర్ నిబంధ‌న‌లు.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే.
x

ITR Rules: అమ‌ల్లోకి కొత్త ఐటీఆర్ నిబంధ‌న‌లు.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే.

Highlights

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నుల (Income Tax Returns) దాఖలులోకి కొన్ని కీలకమైన మార్పులు వచ్చాయి.

ITR Rules: 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నుల (Income Tax Returns) దాఖలులోకి కొన్ని కీలకమైన మార్పులు వచ్చాయి. పాత పన్ను విధానాన్ని అనుసరించే వారు ఇకపై మినహాయింపులను పొందాలంటే, వాటికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇది పన్ను విధానంలో పారదర్శకతను పెంచడమేగాక, తప్పుడు క్లెయిమ్‌లను నిరోధించడానికీ ఉపయోగపడనుంది.

ఫారం-16 ఆధారంగా ITR దాఖలుపై స్పష్టత

ఉద్యోగులు సాధారణంగా యాజమాన్యం జారీ చేసే Form-16 ఆధారంగా ITR-1 లేదా ITR-2 దాఖలు చేస్తారు. ఈసారి మాత్రం ఇది సరిపోదు. మీరు 80C, 80D, HRA, 80U, 80DD వంటి సెక్షన్ల కింద మినహాయింపులు పొందాలనుకుంటే, వాటి ఆధారాలు తగినవిగా సమర్పించాల్సి ఉంటుంది. లేకపోతే ఆ మినహాయింపులు చెల్లవు. ఆధారాలు లేకుండా దాఖలైన క్లెయిమ్‌లను ఆదాయపు పన్ను విభాగం తిరస్కరించవచ్చు.

గృహ రుణ మినహాయింపు – పూర్తి డాక్యుమెంటేషన్ అవసరం

Section 24(b) కింద గృహ రుణ వడ్డీపై రూ.2 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు. కానీ ఇది పొందాలంటే మీరు

రుణం తీసుకున్న బ్యాంకు పేరు, లోన్ అకౌంట్ నంబర్, రుణం తీసుకున్న తేదీ, చెల్లించిన వడ్డీ మొత్తం, బకాయిల వివరాలు వంటివి తెలుసుకోవాలి. ఈ సమాచారం లేకపోతే, మినహాయింపు ఆమోదం ల‌భించ‌దు.

ఆరోగ్య బీమా, వైద్య మినహాయింపులు:

Section 80D కింద ఆరోగ్య బీమా ప్రీమియంపై రూ.25,000 వరకు (తమ కుటుంబం కోసం), అదనంగా రూ.25,000 లేదా రూ.50,000 (తల్లిదండ్రుల ఆరోగ్య బీమా కోసం – వారి వయస్సు ఆధారంగా) మినహాయింపులు లభిస్తాయి.

అయితే ఈ మినహాయింపులకు పాలసీ నంబర్, బీమా సంస్థ పేరు వంటి వివరాలను తప్పనిసరిగా సమర్పించాలి.

Section 80DD కింద దివ్యాంగుల మెడికల్ ఖర్చులకు: సాధారణ వైకల్యం – రూ.75,000, తీవ్రమైన వైకల్యం – రూ.1,25,000 వరకు మినహాయింపు లభిస్తుంది. ఇవికూడా పొందాలంటే ఆధార్, పాన్, 10IA సర్టిఫికెట్‌లు తప్పనిసరిగా ఇవ్వాలి.

విద్యారుణం, ఎలక్ట్రిక్ వాహన రుణంపై మినహాయింపులు Section 80E కింద విద్యారుణంపై చెల్లించిన వడ్డీ మొత్తమంతా మినహాయింపున‌కు అర్హులు. అయితే రుణ సంస్థ పేరు, లోన్ నంబర్, చెల్లించిన వడ్డీ వివరాలు స్పష్టంగా ఇవ్వాలి. Section 80EEB కింద ఎలక్ట్రిక్ వాహన రుణంపై వడ్డీకి రూ.1,50,000 వరకు మినహాయింపు లభిస్తుంది. ఇది 2019-2023 మధ్య తీసుకున్న రుణాలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ మినహాయింపు పొందాలంటే..

వాహనం రిజిస్ట్రేషన్ నంబర్, రుణం తీసుకున్న తేదీ, రుణ సంస్థ వివరాలు అవసరం.

తప్పుడు ఆధారాలు ఇస్తే అప్రమత్తంగా ఉండాలి

కొంతమంది తప్పుడు లేదా అసంపూర్తిగా ఆధారాలు సమర్పిస్తే, ఐటీఆర్ తిరస్కరణకు గుర‌య్యే అవ‌కాశాలు ఉంటాయి. ఆ సందర్భంలో కొత్తగా ఐటీఆర్ దాఖలు చేయాల్సి రావచ్చు లేదా పన్ను శాఖ నోటీసులు అందే అవకాశం ఉంది. అందుకే ఆధారాలు స్పష్టంగా, నిజాయితీగా సమర్పించడం ముఖ్యం.

Show Full Article
Print Article
Next Story
More Stories