New Income Tax Bill: కొత్త ఆదాయపు పన్ను బిల్లు వల్ల ఎవరెవరికి ప్రయోజనం

New Income Tax Bill 2025 What Income Will Not Be Included in Total Income
x

New Income Tax Bill: కొత్త ఆదాయపు పన్ను బిల్లు వల్ల ఎవరెవరికి ప్రయోజనం

Highlights

New Income Tax Bill: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 13న గురువారం లోక్‌సభలో కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025 ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

New Income Tax Bill: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 13న గురువారం లోక్‌సభలో కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025 ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అంతకుముందు, ప్రభుత్వం బుధవారం ఆదాయపు పన్ను బిల్లు ముసాయిదాను విడుదల చేసింది. ఆదాయపు పన్ను చట్టాన్ని సరళీకృతం చేసేందుకు అనే మార్పులు చేయడం ఈ బిల్లు లక్ష్యం. దీనిలో ప్రధాన మార్పుగా 'ఫైనాన్షియల్ ఇయర్' లేదా 'అసెస్‌మెంట్ ఇయర్' అనే పదం బదులుగా 'ట్యాక్స్ ఇయర్' పదం ఉపయోగించనున్నారు. ఈ కొత్త బిల్ లో ఎలాంటి ఆదాయాలు ట్యాక్స్ లెక్కింపులో భాగంగా లెక్కించరో అనే విషయం కూడా పేర్కొన్నారు. ఈ ఆదాయాలను పన్ను లెక్కింపునకు తీసుకోకుండా ప్రత్యేకంగా లెక్కించాలని సూచించారు.

ఎవరి ఆదాయం టోటల్ ఇన్కమ్‌లో భాగం కాదు?

నూతన ఇన్ కమ్ ట్యాక్స్ బిల్ చాప్టర్-3 లో ఇందుకు సంబంధించిన అంశాల గురించి తెలుసుపుతుంది. ఈ చాప్టర్‌లో పన్ను లెక్కింపులో భాగం కాకుండా ఉండే వివిధ ఆదాయాలను సూచించినట్లు పేర్కొన్నారు. ఈ లెక్కింపులో కొన్ని ముఖ్యమైన ఆదాయాలుగా వ్యవసాయంపై ఆదాయం, బీమా నుంచి వచ్చే ఆదాయం, ప్రొవిడెంట్ ఫండ్ (PF) ఆదాయం మొదలైనవి ఉన్నాయి. వీటిని టోటల్ ఇన్కమ్‌లో లెక్కించకుండా ప్రత్యేకంగా లెక్కించనున్నారు.

కొత్త ఆదాయపు పన్ను బిల్లులోని 3వ అధ్యాయం మీ మొత్తం ఆదాయంలో ఏ ఆదాయాలు భాగం కావాలో వివరిస్తుంది. బిల్లులోని షెడ్యూల్‌లోని క్లాజులు 2, 3, 4, 5, 6, 7లలో పేర్కొన్న వర్గాల కిందకు వచ్చే ఆదాయాన్ని పన్ను లెక్కించే ప్రయోజనం కోసం మొత్తం ఆదాయంలో భాగంగా పరిగణించరు. బదులుగా, షెడ్యూల్‌లో పేర్కొన్న నియమాల ప్రకారం ఇది భిన్నంగా లెక్కించబడుతుంది. ఇందులో వ్యవసాయం నుండి వచ్చే ఆదాయం, బీమా నుండి వచ్చే డబ్బు, PF నుండి వచ్చే ఆదాయం మొదలైనవి ఉంటాయి. అయితే, షెడ్యూల్‌లో పేర్కొన్న వర్గాలకు సూచించిన షరతులు ఏదైనా పన్ను సంవత్సరంలో నెరవేర్చకపోతే ఆ సంవత్సరం పన్ను నిబంధనల ప్రకారం వాటిపై పన్ను లెక్కిస్తారని బిల్లు పేర్కొంటుంది.

బిల్లులోని 2, 3, 4, 5, 6, 7 షెడ్యూల్‌లకు కేంద్ర ప్రభుత్వం నియమాలను రూపొందించవచ్చు. వారి కోసం కొత్త నోటిఫికేషన్ జారీ చేయవచ్చు. రాజకీయ పార్టీలు, ఎన్నికల ట్రస్టుల ఆదాయం మొత్తం ఆదాయంలో చేరదు. ఏదైనా రాజకీయ పార్టీ లేదా ఎన్నికల ట్రస్ట్ మొత్తం ఆదాయాన్ని లెక్కించేటప్పుడు, బిల్లులోని షెడ్యూల్-8లోని నియమాలు వర్తిస్తాయి. రాజకీయ పార్టీలు తమ ఆస్తుల నుండి వచ్చే ఆదాయం, మూలధన లాభాలు మొదలైన వాటి ఖాతాలను నిర్వహించాలని షెడ్యూల్-8 పేర్కొంది. అవి రూ. 20,000 కంటే ఎక్కువ విలువైన ఎన్నికల బాండ్లను తీసుకుంటే దానికి సంబంధించిన రికార్డును నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే అవి రూ. 2,000 కంటే ఎక్కువ విరాళాలను స్వీకరించలేవు, అలా చేస్తే దాని రికార్డును తప్పనిసరిగా ఉంచుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories