Netflix: నెట్‌ఫ్లిక్స్‌కు 10 లక్షల సబ్‌స్క్రైబర్లు గుడ్‌బై..

Netflix Loses Almost a Million Subscribers
x

Netflix: నెట్‌ఫ్లిక్స్‌కు 10 లక్షల సబ్‌స్క్రైబర్లు గుడ్‌బై..

Highlights

Netflix Loses Subscribers: ప్రముఖ ఓటీటీ సంస్ద నెట్ ఫ్లెక్స్ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 20 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయిందని...

Netflix Loses Subscribers: ప్రముఖ ఓటీటీ సంస్ద నెట్ ఫ్లెక్స్ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 20 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయిందని, తర్వాతి మూడు నెలల్లో మరో 20 లక్షల మందిని కోల్పోతుందని అంచనా వేశారు. కానీ ఏప్రిల్ నుంచి జూన్ వరకు తాము 9,70000 మంది సబ్ స్క్రైబర్స్ ను మాత్రమే కోల్పోయినట్లు సంస్ద ప్రకటించింది. గతేడాది డిసెంబర్ త్రైమాసికంలో నెట్‌ఫ్లిక్స్ పాపులర్ కొరియన్ టెలివిజన్ సిరీస్ స్క్విడ్ గేమ్, దాని ముఖ్యమైన రెండు మూవీస్​ అయిన డోంట్ లుక్ అప్,.. రెడ్ నోటీసు లతో వ్యూయర్స్​ని రాబట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా 222 మిలియన్ల వినియోగదారులను కలిగి ఉన్న ఏకైక స్ట్రీమింగ్​ సర్వీస్​గా నెట్​ఫ్లిక్స్​ పేరుగాంచింది. అయితే 2020లో 37 మిలియన్లకు 2021లో 18 మిలియన్లకు దాని సబ్​స్క్రైబర్స్​ పడిపోయారు. అంటే దాదాపు 50% కంటే ఎక్కువగా సబ్​స్క్రైబర్స్​ తగ్గినట్టు తెలుస్తోంది.

జపాన్, ఇండియాలలో నెట్ ఫ్లెక్స్ ఊహించిన దానికంటే వేగంగా విస్తరించింది. క్రేజీ సిరీస్ లకు సంబందించి వారం వారం ఒక ఎపిసోడ్‌ను విడుదల చేసే మిగతా ఓటీటీల మాదిరిగా కాకుండా నెట్‌ఫ్లిక్స్ మొత్తం ఎపిసోడ్స్​ని ఒకేసారి విడుదల చేస్తుంది. కానీ మిగతా ఓటీటీ ల కంటే‌ ఎక్కువ ఫీజు ను నెట్ ప్లెక్స్ ఆశిస్తున్న తరుణంలో , 23% మంది అమెరికన్లు తమ సభ్యత్వాలను రద్దు చేసుకున్నారు‌ . ఈ పరిస్దితుల్లో సబ్ స్క్రిప్షన్ రేట్ లను పెంచితే మొదటికే మోసం వస్తుందని గ్రహించిన సంస్ద, వచ్చే ఏడాది నుంచి యాడ్ సపోర్టెడ్ స్ట్రీమింగ్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ‌దీని వల్ల అటు నష్టాలను పూడ్చుకొవటంతో పాటు, వినియోగదారులకు అదనపు భారం లేకుండా చెయ్యెచ్చన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories