Post Offices: పోస్టాఫీసులో అకౌంట్ ఉందా.. అయితే మీకు ఈ ప్రయోజనాలు తెలుసా..?

Post Offices: పోస్టాఫీసులో అకౌంట్ ఉందా.. అయితే మీకు ఈ ప్రయోజనాలు తెలుసా..?
Post Offices: పోస్టాఫీసు ఖాతాదారులకి ప్రభుత్వం గొప్ప సౌకర్యాలని కల్పిస్తోంది.
Post Offices: పోస్టాఫీసు ఖాతాదారులకి ప్రభుత్వం గొప్ప సౌకర్యాలని కల్పిస్తోంది. మే 20 నుంచి పోస్టాఫీసులో కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. దీని కింద ఇప్పుడు ఖాతాదారులు ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. పోస్టాఫీసు ద్వారా ప్రభుత్వం NEFT, RTGS సేవలని ప్రారంభించింది. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు.
పోస్టాఫీసు అందించిన సమాచారం ప్రకారం.. పోస్టాఫీసులో మే 18 నుంచి NEFT సౌకర్యం ప్రారంభం కాగా RTGS సౌకర్యం మే 31 నుంచి ప్రారంభమైంది. అంటే ఇప్పుడు పోస్టాఫీసు ఖాతాదారులకు డబ్బులు పంపే వెసులుబాటు లభించింది. దీంతో పాటు బ్యాంకుల మాదిరి యూజర్ ఫ్రెండ్లీగా మారింది. ఇది మాత్రమే కాదు ఈ సదుపాయం 24×7×365 ఉంటుంది.
అన్ని బ్యాంకులు NEFT, RTGS సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఇప్పుడు పోస్టాఫీసు కూడా ఈ సదుపాయాన్ని కల్పించింది. NEFT, RTGS ద్వారా వేరొక ఖాతాకు డబ్బు పంపడం చాలా సులభం. దీంతో మీరు త్వరగా డబ్బును బదిలీ చేసుకోవచ్చు. వాస్తవానికి ఈ బదిలీకి కొన్ని నిబంధనలు, షరతులు ఉన్నాయి. NEFTలో డబ్బును బదిలీ చేయడానికి పరిమితి లేదు. అయితే RTGSలో మీరు ఒకేసారి కనీసం రెండు లక్షల రూపాయలను మాత్రమే పంపాలి.
దీని కోసం మీరు కొన్ని ఛార్జీలు చెల్లించాలి. మీరు NEFT చేస్తే ఇందులో రూ. 10 వేల వరకు రూ. 2.50 + GST చెల్లించాలి. 10 వేల నుంచి 1 లక్ష రూపాయలకు 5 రూపాయలు + GST ఉంటుంది. అదే సమయంలో రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు రూ. 15 + GST , 2 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో రూ. 25 + GST చెల్లించాలి.
సీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMTTRS Party: ప్రభుత్వ పదవులు సరే.. పార్టీ పదవులు ఎలా...?
17 Aug 2022 3:30 PM GMTMaheswar Reddy: నేను కాంగ్రెస్ లోనే ఉంటా.. రాజీనామా చేయను
17 Aug 2022 7:58 AM GMTతిరుమలలో భారీ వర్షం
17 Aug 2022 7:01 AM GMTRenuka Chowdhury: లీడర్లు కాదు .. క్యాడర్ ముఖ్యం
17 Aug 2022 6:43 AM GMTమహారాష్ట్రలోని గోండియా దగ్గర ప్రమాదం
17 Aug 2022 5:44 AM GMT
కేంద్ర, రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం
19 Aug 2022 1:30 AM GMTగణేశ్ ఉత్సవాల్లో పౌర విభాగాలతో సమన్వయం
19 Aug 2022 1:14 AM GMTHealth Tips: ఇంగువ ఎక్కువగా తింటే కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లే..!
18 Aug 2022 4:00 PM GMTSleep: రాత్రిపూట ఇవి తింటే మీ నిద్ర సంగతి అంతే..!
18 Aug 2022 3:30 PM GMTఉద్యోగులకి అలర్ట్.. 7 లక్షలు అస్సలు కోల్పోకండి..!
18 Aug 2022 3:00 PM GMT