దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల పరంపర

Arun Chilukuri
Published on: 25 Nov 2020 11:42 AM IST
దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల పరంపర
X

దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల పరంపర కొనసాగిస్తున్నాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ డబుల్ సెంచరీ లాభాలతో దూకుడు కొనసాగిస్తుండగా నిఫ్టీ 13 వేల ఎగువన ట్రేడవుతోంది. ఆరంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 235 పాయింట్ల మేర ఎగసి 44 వేల 758 వద్దకు చేరగా నిఫ్టీ 66 పాయింట్ల లాభంతో 13 వేల 121 వద్ద కొనసాగుతోంది. కోవిడ్ వ్యాక్సిన్ పురోగతి వార్తలతో పాటు ప్రపంచ ఆర్థిక పునరుజ్జీవన అవకాశాల నేపధ్యంలో ఏషియా మార్కెట్లు పాజిటివ్ ధోరణిలో కదలాడుతున్నాయి. వెరసి సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీ సూచీలు లాభాల బాటన పరుగులు తీస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story