Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో తెలుసా?

Mutual Funds
x

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో తెలుసా?

Highlights

Mutual Funds: మ్యూచువల్ ఫండ్ ఏంటంటే.. చాలా మందిని కలిపి, వాళ్లందరి దగ్గర నుండి డబ్బు తీసుకొని, ఒకేచోట పెట్టుబడి పెట్టే సిస్టం. మనం నేరుగా స్టాక్స్ కొనకుండా, నిపుణులు మన దగ్గర నుండి డబ్బు తీసుకొని వాళ్ల పరిజ్ఞానం ద్వారా స్టాక్ మార్కెట్‌, బాండ్లు, ఇతర సాధనాల్లో పెట్టుబడి పెడతారు.

Mutual Funds: మ్యూచువల్ ఫండ్ ఏంటంటే.. చాలా మందిని కలిపి, వాళ్లందరి దగ్గర నుండి డబ్బు తీసుకొని, ఒకేచోట పెట్టుబడి పెట్టే సిస్టం. మనం నేరుగా స్టాక్స్ కొనకుండా, నిపుణులు మన దగ్గర నుండి డబ్బు తీసుకొని వాళ్ల పరిజ్ఞానం ద్వారా స్టాక్ మార్కెట్‌, బాండ్లు, ఇతర సాధనాల్లో పెట్టుబడి పెడతారు. మనం పెట్టిన డబ్బుతో వచ్చే లాభం, నష్టం మనకి వాటా ప్రకారంగా వస్తుంది. ఇప్పుడు మీరు అడగొచ్చు.. ఎలాంటి ఫండ్స్ ఉంటాయి? అని. చక్కగా చెప్పాలంటే, వీటిని మూడు ప్రధాన రకాలుగా చూడవచ్చు. ఈక్విటీ ఫండ్స్... ఇవి ఎక్కువ లాభాలు ఆశించే వారికి. ఎందుకంటే ఇవి స్టాక్స్‌లో పెట్టుబడి పెడతాయి. తర్వాత డెట్ ఫండ్స్.. ఇవి స్టేబుల్ ఆదాయం ఇస్తాయి, కానీ ఎక్కువ రాబడి ఆశించకూడదు. ఇక చివరిగా హైబ్రిడ్ ఫండ్స్.. అంటే ఈక్విటీ + డెట్ కలిపి ఉండే మిక్స్డ్ ఫండ్ అన్నమాట. కొంచెం రిస్క్ తీసుకోవచ్చు.. కానీ పూర్తిగా కాదు అనే వాళ్లకు బెస్ట్ ఆప్షన్.

అంతేకాదు, మీ పిల్లల చదువు కోసం, పెళ్లి ఖర్చు కోసం, పదవీవిరమణ లాంటి నిర్దిష్ట లక్ష్యాల కోసం 'సొల్యూషన్ ఓరియెంటెడ్ ఫండ్స్' కూడా ఉన్నాయి. వీటిలో మిక్స్డ్ ప్లానింగ్ ఉంటుంది. ఇంకా కొన్ని ఇతర ఫండ్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకి, లిక్విడ్ ఫండ్స్ అనేవి తక్కువ రోజుల్లో అవసరమయ్యే డబ్బుకు బాగుంటాయి. ELSS ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. ఓపెన్ ఎండ్ ఫండ్స్ అంటే ఎప్పుడైనా డబ్బు పెట్టవచ్చు, తీసుకోవచ్చు. క్లోజ్డ్ ఎండ్ ఫండ్స్ అంటే ఒక నిర్ణీత సమయం వరకు డబ్బు తీసుకోవడం కుదరకపోవచ్చు. మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి అన్నదేగా మీ ప్రశ్న? రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి lump sum, అంటే ఒకే సారి పెద్ద మొత్తంలో పెట్టడం… రెండోది SIP, అంటే నెలనెలా కొద్దిగా పెట్టడం. చాలా మందికి SIP సౌకర్యంగా ఉంటుంది.

ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న క్లారిటీ. మీరు మ్యూచువల్ ఫండ్ వెబ్‌సైట్‌కి వెళ్లి నేరుగా పెట్టుబడి పెట్టవచ్చు ఇది డైరెక్ట్ ప్లాన్. లేదా మీరు బ్రోకర్, ఫైనాన్షియల్ అడ్వైజర్ ద్వారా పెట్టవచ్చు ఇది రెగ్యులర్ ప్లాన్. డైరెక్ట్‌లో ఫీజులు తక్కువ, కానీ అవగాహన ఉండాలి. రెగ్యులర్ ప్లాన్‌లో సులభత, కానీ కొంచెం ఎక్కువ ఖర్చు. ఇప్పుడీ ఆలోచన రాకపోదు.. పెట్టిన డబ్బు పోతుందేమో అనుకుంటారు. ఎందుకంటే ఇది మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి కొంత రిస్క్ ఉంటుంది. కానీ ఓ దీర్ఘకాలిక ప్లాన్ చేసుకుంటే లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు కూడా అదే చూపిస్తున్నాయి. కాబట్టి మీరు డబ్బు సేవ్ చేయాలి అనుకుంటుంటే? పక్కాగా ప్లాన్ చేసుకోవాలనుకుంటే? అప్పుడు మ్యూచువల్ ఫండ్ ఓ మంచి ఆప్షన్ అవుతుందనడంలో సందేహమే లేదు. కొంచెం ఆలోచించి, చిన్నగా మొదలు పెడితే SIP ద్వారా మీ కలలను నెరవేర్చుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories