Microsoft Lays Off: ఏఐ ప్రభావం... మైక్రోసాఫ్ట్‌లో మరోసారి ఉద్యోగాల కోత

Microsoft Lays Off
x

Microsoft Lays Off: ఏఐ ప్రభావం... మైక్రోసాఫ్ట్‌లో మరోసారి ఉద్యోగాల కోత

Highlights

Microsoft Lays Off: ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మళ్లీ ఉద్యోగాల కోతకు పాల్పడుతోంది. ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా 3% ఉద్యోగాలను తగ్గించిన ఈ సంస్థ, ఇప్పుడు మరోసారి కొన్ని వందల ఉద్యోగులను తొలగించనుంది.

Microsoft Lays Off: ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మళ్లీ ఉద్యోగాల కోతకు పాల్పడుతోంది. ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా 3% ఉద్యోగాలను తగ్గించిన ఈ సంస్థ, ఇప్పుడు మరోసారి కొన్ని వందల ఉద్యోగులను తొలగించనుంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో మారుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని సంస్థాగత పునర్వ్యవస్థీకరణ చేపట్టుతోంది.

వాషింగ్టన్ రాష్ట్రంలోని రెడ్‌మండ్ కార్యాలయంలో అదనంగా 305 మంది ఉద్యోగులను తొలగించినట్లు మైక్రోసాఫ్ట్ వాషింగ్టన్ స్టేట్ ఎంప్లాయ్‌మెంట్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌కు సమర్పించిన ఫైలింగ్ ద్వారా తెలిసింది. ఇది గత నెలలో ప్రకటించిన 6,000 ఉద్యోగాల కోతకు అదనమని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి స్పష్టం చేశారు. "మారుతున్న మార్కెట్‌ పరిస్థితులలో విజయం సాధించేందుకు అవసరమైన సంస్థాగత మార్పులు చేస్తున్నాం" అని ఆయన వివరించారు.

ఈ విషయం పై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందిస్తూ, "ఇది ఉద్యోగుల పనితీరుతో సంబంధం లేదు. ఇది పూర్తిగా వ్యూహాత్మక నిర్ణయం. సంస్థలో ఏఐ ప్రాధాన్యత పెరగడం వల్ల బృందాలను మళ్లీ క్రమబద్ధీకరించాల్సి వచ్చింది" అని చెప్పారు. ఉద్యోగులపై దీని వల్ల వచ్చే భావోద్వేగ ప్రభావాన్ని కంపెనీ అర్థం చేసుకుంటుందని కూడా ఆయన అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories