Maruti Alto: 50 వేలు చెల్లించి మారుతి ఆల్టోని ఇంటికి తీసుకెళ్లొచ్చు.. EMI ఎంతంటే..?

Maruti Alto: 50 వేలు చెల్లించి మారుతి ఆల్టోని ఇంటికి తీసుకెళ్లొచ్చు.. EMI ఎంతంటే..?

Arun Chilukuri
Updated on: 16 Feb 2022 6:00 PM IST
Maruti Alto: 50 వేలు చెల్లించి మారుతి ఆల్టోని ఇంటికి తీసుకెళ్లొచ్చు.. EMI ఎంతంటే..?
X

Maruti Alto: 50 వేలు చెల్లించి మారుతి ఆల్టోని ఇంటికి తీసుకెళ్లొచ్చు.. EMI ఎంతంటే..?

Maruti Alto: కస్టమర్లు ఎక్కువగా ఇష్టపడే వాహనాల్లో మారుతీ ఆల్టో 800 ఒకటి. తక్కువ ధర, గొప్ప మైలేజీ, మంచి పునఃవిక్రయం విలువ కారణంగా ప్రజలు దీనిని ఎక్కువగా ఇష్టపడతారు. మారుతి ఆల్టో 800 కోసం మీకు రూ.50000 డౌన్ పేమెంట్ ఇస్తే EMI ద్వారా కారు ఇంటికి తీసుకెళ్లవచ్చు. దీంతో పాటు కారు ఫీచర్లు, ఇతర వివరాలు కూడా తెలుసుకుందాం.

ఈ అద్భుతమైన బడ్జెట్ కారుకు BS6 నిబంధనలతో కూడిన 0.8 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ అమర్చారు. CNG మోడ్‌లో దీన్ని రన్ చేస్తే ఈ ఇంజన్ 41 PS పవర్, 60 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మారుతి ఆల్టో 800 ఫీచర్ల గురించి చెప్పాలంటే ఇది 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. దీనిని ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేకి కనెక్ట్ చేయవచ్చు. ఇది కీలెస్ ఎంట్రీ, ఫ్రంట్ పవర్ విండోలతో వస్తుంది. ప్రయాణీకుల భద్రత పరంగా డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్, వెనుక పార్కింగ్ సెన్సార్లు, EBD తో కూడిన ABS వంటి ఫీచర్లు అందించారు.

మారుతి ఆల్టో 800 ధర రూ.3.25 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలై రూ.4.95 లక్షల వరకు ఉంటుంది. మారుతి ఆల్టో మైలేజీకి సంబంధించి పెట్రోల్‌పై 22.05 కిమీ, సిఎన్‌జిపై 31.59 కిమీ మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. మీరు రూ. 50000 డౌన్ పేమెంట్ చెల్లించి మారుతీ ఆల్టో 800 STD పెట్రోల్‌ను కొనుగోలు చేయవచ్చు. కాలిక్యులేటర్ ప్రకారం EMI 5సంవత్సరాలకు 9.8 శాతం, బ్యాంక్ లోన్ ప్రకారం నెలకు రూ. 6551 అవుతుంది. దీంతో పాటు ఫైనాన్స్ పొందడానికి మీరు 5 సంవత్సరాలలో సుమారు రూ. 83,296 లక్షల వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. మారుతీ ఆల్టో 800కి లభించే లోన్, డౌన్ పేమెంట్, వడ్డీ రేట్లు కూడా మీ బ్యాంకింగ్, CIBIL స్కోర్‌పై ఆధారపడి ఉంటాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story