Married Women: పెళ్లయిన మహిళల కెరీర్‌ ఆప్షన్స్‌.. ఇంటి నుంచే సంపాదించవచ్చు..!

Married Women: పెళ్లయిన మహిళలు బయట ఉద్యోగాలు చేస్తూ మళ్లీ ఇంటికొచ్చి పని చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది.

Jyothi
Updated on: 13 July 2023 4:00 PM IST
Married Women Can Earn Well Sitting at Home by Opting for These Career Options
X

Married Women: పెళ్లయిన మహిళల కెరీర్‌ ఆప్షన్స్‌.. ఇంటి నుంచే సంపాదించవచ్చు..!

Married Women: పెళ్లయిన మహిళలు బయట ఉద్యోగాలు చేస్తూ మళ్లీ ఇంటికొచ్చి పని చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అందుకే చాలామంది మహిళలు ఉద్యోగాలు వదిలేసి ఇళ్లు చక్కదిద్దే ప్రయత్నంలో ఉంటారు. కానీ మనసులో వారికి ఏదో ఒక వెలితి ఉంటుంది. ఉద్యోగం వదిలేశామనే బాధ ఉంటుంది. అలాంటి మహిళలు కొన్ని కెరీర్‌ ఆప్షన్స్‌ ఎంచుకొని ఇంటి నుంచే సంపాదించే అవకాశం ఉంటుంది. అలాంటి కొన్ని పార్ట్‌టైమ్‌ ఉద్యోగాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

వంట చేయడం

చాలామంది మహిళలకి వంట చేయడం అంటే ఇష్టంగా ఉంటుంది. ఇలాంటి వారు చిన్నగా టిఫిన్‌ సెంటర్‌ మెయింటెన్‌ చేయవచ్చు. దీనివల్ల ఇంటి దగ్గరే మంచిగా సంపాదించవచ్చు.

అభిరుచులు

చాలామంది మహిళలు వివిధ రకాల అభిరుచులని కలిగి ఉంటారు. వివిధ పనులలో నైపుణ్యం కలిగి ఉంటారు.పెయింటింగ్, గిటార్, యోగా, కరాటే వంటి వాటిలో నిపుణురాలైతే పిల్లలకి నేర్పించి సంపాదించవచ్చు.

ఫ్రీలాన్స్ కంటెంట్ రైటింగ్

భాషలపై పరిజ్ఞానం ఉంటే ఫ్రీలాన్స్ కంటెంట్ రైటింగ్ ఎంచుకోవచ్చు. ఇంట్లో కూర్చొని మ్యాగజైన్‌లు, వార్తాపత్రికలు, సోషల్‌ మీడియా, వెబ్‌సైట్లలో కంటెంట్‌ రాయవచ్చు. దీని ద్వారా ఉపాధి పొందవచ్చు.

క్రాఫ్ట్ ఐటెమ్

మీకు ఆర్ట్, క్రాఫ్ట్ వర్క్ చేయడం, డెకరేషన్‌కు సంబంధించిన వస్తువులను తయారు చేయడం తెలిస్తే క్రాఫ్ట్ ఐటెమ్ సెల్లింగ్ రంగంలో ఇంటి నుంచి పని చేయవచ్చు. అమ్మకాలను పెంచుకోవడానికి సోషల్ మీడియా సహాయం తీసుకోవచ్చు.

ట్యూషన్ టీచర్

పిల్లలకు ట్యూషన్ చెప్పగలిగే సామర్థ్యం కలిగి ఉంటే ఇంటి నుంచి సంపాదించడానికి ఇంతకంటే మంచి ఆప్షన్ మరొకటి ఉండదు. దీంతో తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించవచ్చు.

బ్యూటీషియన్

బ్యూటీషియన్‌గా పనిచేసే మహిళలకి ఈరోజుల్లో మంచి డిమాండ్‌ ఉంది. బ్యూటీషియన్ కోర్సు చేయడం ద్వారా చిన్న బ్యూటీ పార్లర్ ప్రారంభించి సంపాదించవచ్చు. భవిష్యత్తులో ఈ పనిని మరింత పెంచుకోవచ్చు.

Jyothi

Jyothi

Next Story