LPG Cylinder Prices: భారీగా తగ్గిన సిలిండర్ ధర..

LPG Cylinder Prices: కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు చమురు కంపెనీలు శుభవార్త చెప్పాయి.

Arun Chilukuri
Published on: 1 July 2022 1:18 PM IST
LPG Cylinder Prices Slashed From Today
X

LPG Cylinder Prices: భారీగా తగ్గిన సిలిండర్ ధర.. 

LPG Cylinder Prices: కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు చమురు కంపెనీలు శుభవార్త చెప్పాయి. గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గించాయి. అయితే, ధర తగ్గింపు ప్రస్తుతానికైతే కేవలం 19 కేజీల కమర్షియల్ సిలిండర్లకు మాత్రమే వర్తిస్తుంది. జూలై 1 నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 198 దిగొచ్చింది. ప్రాంతం ప్రాతిపదికన సిలిండర్ రేటు తగ్గింపులో కొంత వ్యత్యాసం ఉండొచ్చు.

ప్రతినెల 1వ తేదీన గ్యాస్ ధరలను సమీక్షించి ప్రకటించే ఆయిల్ కంపెనీలు.. ఈసారి భారీగా ఉపశమనం కలిగించే రీతిలో తగ్గింపు నిర్ణయం తీసుకున్నాయి. మధ్య తరగతి ప్రజలు వినియోగించే 14.2 కిలోల వంటింటి సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. తాజా ధరల ప్రకారం ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.2021 ఉండగా.. అదే మన హైదరాబాదులో రూ.2,242, ముంబయిలో రూ.1981కి చేరాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story