Honda Shine: హోండా బైక్‌పై క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్.. ప్రత్యేకత ఏంటంటే..?

Honda Shine: హోండా బైక్‌పై క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్.. ప్రత్యేకత ఏంటంటే..?

Rama Rao
Updated on: 21 March 2022 4:00 PM IST
Low Down Payment on Honda Bike Cashback Offer Up To 5,000
X

Honda Shine: హోండా బైక్‌పై క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్.. ప్రత్యేకత ఏంటంటే..?

Honda Shine: హోండా టూ-వీలర్స్ ఇండియా అత్యంత ప్రజాదరణ పొందిన షైన్‌ బైక్‌ని 10 మిలియన్ యూనిట్లకు పైగా విక్రయించే మైలురాయిని సాధించింది. ఇప్పుడు కంపెనీ తన అమ్మకాలను పెంచుకోవడానికి ఈ బైక్‌పై క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. ఈ ప్రత్యేక ఆఫర్‌లో కస్టమర్‌లు రూ.5,999 వరకు తక్కువ డౌన్‌పేమెంట్‌తో రూ. 5,000 వరకు క్యాష్‌బ్యాక్ ప్రయోజనాన్ని పొందుతున్నారు. ఈ ఆఫర్ మార్చి 31, 2022 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎంపిక చేసిన డెబిట్ కార్డ్‌లతో చేసిన కొనుగోళ్లపై మాత్రమే ఈ క్యాష్‌బ్యాక్ అందిస్తున్నారని గమనించండి.

కంపెనీ ప్రకారం 125సీసీ సెగ్మెంట్‌లో షైన్‌ బైక్‌ని 10 మిలియన్ల మంది వినియోగదారులు కొనుగోలు చేశారు. 125 సిసి సెగ్మెంట్‌లో హోండా బెస్ట్ సెల్లింగ్ మోటార్‌సైకిల్ ఇదే. ఈ బైక్ పనితీరు పరంగా చాలా మెరుగైనదిగా గుర్తింపు సాధించింది. వాస్తవానికి ఈ బైక్‌లో 123.94 CC సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, పవర్ కోసం SI ఇంజన్ ఉంది. ఇది గరిష్టంగా 7500 RPM వద్ద 7.9kW శక్తిని, 6000 RPM వద్ద 11 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది.

హోండా షైన్ ఇండియన్ మార్కెట్లో 5 కలర్లలో లభిస్తుంది. వీటిలో డిసెంట్ బ్లూ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే, జెనీ గ్రే మెటాలిక్, రెబెల్ రెడ్ మెటాలిక్ ఉన్నాయి. అలాగే హోండా షైన్ పొడవు 2046 మిమీ, వెడల్పు 737 మిమీ, ఎత్తు 1116 మిమీ ఉంటుంది. దీని వీల్ బేస్ 1285 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 162 mm. డ్రమ్ బ్రేక్, డిస్క్ బ్రేక్ వేరియంట్లు రెండింటి కర్బ్ బరువు 114 కిలోలు ఉంటుంది. ఇందులో 10.5 లీటర్ల సామర్థ్యం ఉన్న పెట్రోల్ ట్యాంక్ అమర్చారు. ఇండియన్ మార్కెట్లో డ్రమ్ బ్రేక్ ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 74,943, ఇది డిస్క్ బ్రేక్ వేరియంట్‌పై రూ. 79,343 ధర పలుకుతోంది.

Rama Rao

Rama Rao

Next Story