ప్రతిరోజు 44 రూపాయల పొదుపు మీ భవిష్యత్‌ని మార్చేస్తుంది.. 28 లక్షల ఫండ్ సృష్టిస్తుంది..!

LIC Jeevan Umang Policy: మంచి రాబడి పొందడానికి ప్రజలు స్టాక్‌లు, మ్యూచువల్ ఫండ్‌లు, క్రిప్టోలో పెట్టుబడి పెడుతున్నారు.

Arun Chilukuri
Updated on: 9 Feb 2023 9:00 PM IST
LIC Jeevan Umang Policy Check for all Details
X

ప్రతిరోజు 44 రూపాయల పొదుపు మీ భవిష్యత్‌ని మార్చేస్తుంది.. 28 లక్షల ఫండ్ సృష్టిస్తుంది..!

LIC Jeevan Umang Policy: మంచి రాబడి పొందడానికి ప్రజలు స్టాక్‌లు, మ్యూచువల్ ఫండ్‌లు, క్రిప్టోలో పెట్టుబడి పెడుతున్నారు. అయితే మధ్యతరగతి ప్రజలు ఇందులో పెట్టుబడి పెట్టలేరు. అలాంటివారు ఎక్కువగా అతిపెద్ద బీమా కంపెనీ అయిన ఎల్‌ఐసిని విశ్వసిస్తున్నారు. ప్రజలు దీనిని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. ఎల్ఐసి తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు వివిధ పథకాలను తీసుకువస్తూనే ఉంటుంది. వీటిలో ఒకటి ఎల్‌ఐసి జీవన్ ఉమంగ్ పాలసీ. ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల మీ కుటుంబ భవిష్యత్తుకు భద్రత కల్పించవచ్చు. ఇందులో సురక్షితమైన ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ అద్భుతమైన పాలసీ గురించి వివరంగా తెలుసుకుందాం.

ఎల్‌ఐసీ జీవన్ ఉమంగ్ పాలసీ అనేక అంశాలలో ఇతర పథకాల కంటే భిన్నంగా ఉంటుంది. 90 రోజుల నుంచి 55 ఏళ్ల లోపు వారు ఈ పాలసీని తీసుకోవచ్చు. ఇది ఎండోమెంట్ ప్లాన్. ఇందులో లైఫ్ కవర్‌తో పాటు, మెచ్యూరిటీపై ఒకేసారి మొత్తం లభిస్తుంది. దీని కింద మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత ప్రతి సంవత్సరం స్థిర ఆదాయం వస్తుంది. మరోవైపు పాలసీదారు మరణించిన తర్వాత అతని కుటుంబ సభ్యులు, నామినీకి ఏకమొత్తం లభిస్తుంది. ఈ పథకం గొప్ప లక్షణం ఏంటంటే ఇది 100 సంవత్సరాల వరకు కవరేజీని అందిస్తుంది.

ఈ పాలసీలో మీరు ప్రతి నెలా రూ.1302 ప్రీమియం చెల్లిస్తే సంవత్సరానికి రూ.15,298 అవుతుంది. ఇది రోజుకు దాదాపు 45 రూపాయలు. ఈ పాలసీని 30 ఏళ్ల పాటు కొనసాగిస్తే మొత్తం దాదాపు రూ.4.58 లక్షలు అవుతుంది. మీరు పెట్టిన పెట్టుబడిపై కంపెనీ 31వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం 40 వేల రాబడిని ఇవ్వడం ప్రారంభిస్తుంది.31 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల వరకు సంవత్సరానికి 40 వేల రిటర్న్ తీసుకుంటారు. దాదాపు 27.60 లక్షల రూపాయల మొత్తం లభిస్తుంది.

ఈ ప్రత్యేక పాలసీ ప్రకారం పెట్టుబడిదారుడు ప్రమాదంలో మరణిస్తే లేదా అంగవైకల్యానికి గురైతే టర్మ్ రైడర్ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. మార్కెట్ రిస్క్ దీనిపై ఎలాంటి ప్రభావం చూపదు. ఎల్‌ఐసీ లాభాలు, నష్టాలు ఈ పాలసీపై ప్రభావం చూపుతాయి. ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద ఈ పాలసీని తీసుకోవడానికి పన్ను మినహాయింపు అందుబాటులో ఉంటుంది. జీవన్ ఉమంగ్ పాలసీలో ఏదైనా ప్లాన్ తీసుకోవాలనుకుంటే రెండు లక్షల రూపాయల బీమా తీసుకోవాలని గుర్తుంచుకోండి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story