LIC IPOలో షేర్లు కొనాలంటే నిబంధనలు తప్పనిసరి.. అవేంటంటే..?

LIC IPO Update News Policy Holders Need to know these Terms in Order to buy Shares in LIC IPO
x

LIC IPOలో షేర్లు కొనాలంటే నిబంధనలు తప్పనిసరి.. అవేంటంటే..?

Highlights

LIC IPO: స్టాక్ మార్కెట్‌లో ప్రస్తుతం ఐపీఓ హవా నడుస్తోంది. ఒకదాని తర్వాత ఒకటి పెద్ద కంపెనీలు ఐపిఓను ప్రారంభించాయి.

LIC IPO: స్టాక్ మార్కెట్‌లో ప్రస్తుతం ఐపీఓ హవా నడుస్తోంది. ఒకదాని తర్వాత ఒకటి పెద్ద కంపెనీలు ఐపిఓను ప్రారంభించాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఎల్‌ఐసీ ఐపీఓ కోసం రిటైల్ ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి పత్రాలు కూడా సమర్పించింది. మార్చి 10న LIC IPO ప్రారంభంకానుంది. ఫిబ్రవరి 13 ఆదివారం ప్రభుత్వం SEBIకి ఇష్యూ కోసం DRHP దాఖలు చేసింది. IPO నుంచి రూ. 63,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎల్‌ఐసి పాలసీ హోల్డర్లు కూడా ఈ ఐపిఓలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో 10 శాతం వారికి రిజర్వ్ చేశారు. అంతేకాకుండా వారికి తగ్గింపు కూడా ఉంటుంది.

ఎల్‌ఐసీ ఐపీఓ ప్రారంభంపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మార్కెట్లోని సమాచారం ప్రకారం కంపెనీ ఇష్యూ ధర రూ. 2000-2100 మధ్య ఉండవచ్చు. ఆదివారం సెబీకి సమర్పించిన ముసాయిదా ప్రకారం ఎల్‌ఐసీ ఇష్యూ పరిమాణం రూ.63,000 కోట్ల వరకు ఉండవచ్చు. మీరు LIC IPOలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ముందుగా కొన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకోండి. PAN, Demat ఖాతాను లింక్ చేసి ఉండాలి. ఈ రెండు పనులను వీలైనంత త్వరగా చేసుకుంటే మంచిది.

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎల్‌ఐసి పాలసీ హోల్డర్‌లు, కంపెనీ ఉద్యోగుల కోసం షేర్ రిజర్వ్ చేశామని స్పష్టం చేసింది. ఇద్దరికీ LIC ఇష్యూ రాయితీపై కేటాయిస్తుంది. ఇష్యూలో 10 శాతం పాలసీ హోల్డర్లకు రిజర్వ్ చేసింది. LIC పాలసీ ల్యాప్ అయినప్పటికీ మీరు రిజర్వ్ కోటాలో వేలం వేయవచ్చు. ఇది కాకుండా ఎల్‌ఐసి ఉద్యోగులకు 5 శాతం వాటా రిజర్వ్ చేశారు. LIC మార్కెట్ చాలా బలంగా ఉంది. దీని మార్కెట్ వాటా 64.1 శాతం. క్రిసిల్ నివేదిక ప్రకారం.. ఇది దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా కంపెనీ. ఈక్విటీపై దాని రాబడి కూడా అత్యధికంగా 82 శాతంగా ఉంది. ఇది ప్రపంచంలోనే మూడో అతిపెద్ద బీమా కంపెనీ.

Show Full Article
Print Article
Next Story
More Stories