CIBIL Score: పర్సనల్‌ లోన్‌కి అర్హులా కాదా అంటే సిబిల్‌ స్కోరు లెక్కించాల్సిందే..!

CIBIL Score: పర్సనల్‌ లోన్‌కి అర్హులా కాదా అంటే సిబిల్‌ స్కోరు లెక్కించాల్సిందే..!
x

CIBIL Score:పర్సనల్‌ లోన్‌కి అర్హులా కాదా అంటే సిబిల్‌ స్కోరు లెక్కించాల్సిందే..!

Highlights

CIBIL Score: ప్రస్తుత కాలంలో ప్రతి వ్యక్తికి ఖర్చులు పెరిగాయి. నెలవారీ జీతం సరిపోవడం లేదు.

CIBIL Score: ప్రస్తుత కాలంలో ప్రతి వ్యక్తికి ఖర్చులు పెరిగాయి. నెలవారీ జీతం సరిపోవడం లేదు. ఇలాంటి సమయాల్లో సామాన్యులు వ్యక్తిగత రుణం తీసుకోవాలని ఆలోచిస్తారు. కానీ బ్యాంకుకు వెళ్లేందుకు భయపడతారు. మీకు పర్సనల్ లోన్ లభిస్తుందా లేదా అనేది మీ CIBIL స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది. మంచి CIBIL స్కోర్ మీ రుణాన్ని వెంటనే మంజూరుచేసేలా చేస్తుంది. మంచి CIBIL స్కోర్‌తో మాత్రమే తక్కువ వడ్డీ రేట్లలో రుణాలు పొందేలా చేస్తుంది. అది ఎలాగో తెలుసుకుందాం.

300, 900 మార్కుల మధ్య మెరుగైన CIBIL స్కోర్ ఉంటుంది. స్కోరు 750 మార్కులు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే బ్యాంకు మీకు సులభంగా రుణం మంజూరుచేస్తుంది. ఇందులో CIBIL స్కోర్ ఎంత మెరుగ్గా ఉంటే అంత సులభంగా లోన్ పొందవచ్చు. CIBIL స్కోర్ 24 నెలల క్రెడిట్ చరిత్రపై ఆధారపడి ఉంటుంది. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్ భారతదేశంలో CIBIL స్కోర్‌ను అందించే ఏకైక ఏజెన్సీ.

మీ CIBIL స్కోరు గురించి తెలుసుకోండి

1.CIBIL వెబ్‌సైట్ www.cibil.comని సందర్శించండి.

2.హోమ్ పేజీలో గెట్ యువర్ ఫ్రీ సిబిల్ స్కోర్‌పై క్లిక్ చేయండి.

3. అన్నింటిలో మొదటిది మీ పేరు, ఈ మెయిల్ ఐడిని ఎంటర్‌ చేయండి. కొత్త పాస్‌వర్డ్‌ను సృష్టించండి.

4. తర్వాత మీ ID ప్రూఫ్‌లో ఏదైనా ఎంచుకోండి. ఆపై మీ పిన్ కోడ్, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్‌ను ఎంటర్‌ చేయండి.

5. మొత్తం సమాచారాన్ని అందించిన తర్వాత ఓకె బటన్‌పై క్లిక్ చేసి కొనసాగించండి.

6. మీ మొబైల్‌లో వచ్చిన వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP)ని నమోదు చేసి కొనసాగించుపై క్లిక్ చేయండి.

7. 'మీ నమోదు విజయవంతమైంది' అనే మెస్సేజ్‌ని అందుకుంటారు. ఆపై వెబ్‌సైట్ డాష్‌బోర్డ్‌కి వెళ్లండి.

8. మీ CIBIL స్కోర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories