Kia India: భారత్‌లో కియా పేరు, లోగో ఛేంజ్
Kia India: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియన్ ఆపరేషన్స్ కోసం కొత్త పేరును ప్రకటించింది.
Kia India: భారత్‌లో కియా పేరు, లోగో ఛేంజ్
Kia India: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియన్ ఆపరేషన్స్ కోసం కొత్త పేరును ప్రకటించింది. భారత్‌లో కియా మోటార్స్ పేరును కియా ఇండియాగా మార్చినట్లు అధికారికంగా వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ అనంతపురంలోని కియా ప్లాంట్‌లో లోగో, పేరును ఇప్పటికే మార్చినట్లు తెలిపింది. దశలవారీగా డీలర్‌షిప్‌లో కూడా మార్పులు చేయనున్నట్లు కియా ప్రకటించింది. ఏడాదిన్నర క్రితం భారత్‌లో అమ్మకాలు ప్రారంభించిన కియా అత్యంత వేగంగా రెండున్నర లక్షల విక్రయాల మైలురాయిని అధిగమించింది. అలాగే, భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న నాలుగో కార్ల బ్రాండ్‌గా కియా నిలిచింది.
Next Story




