Car Insurance: కారు ఇన్సూరెన్స్‌ రెన్యువల్ చేసేటప్పుడు వీటిని గమనించండి..!

Keep These Things in Mind When Renewing Car Insurance
x

Car Insurance: కారు ఇన్సూరెన్స్‌ రెన్యువల్ చేసేటప్పుడు వీటిని గమనించండి..!

Highlights

Car Insurance: కారు ఇన్సూరెన్స్ ప్రీమియం రెన్యువల్ చేసుకునే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.

Car Insurance: కారు ఇన్సూరెన్స్ ప్రీమియం రెన్యువల్ చేసుకునే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. తద్వారా మీ కారు కూడా సురక్షితంగా ఉంటుంది. బీమా ప్రీమియం కూడా ఎక్కువగా పెరగకుండా ఉంటుంది. అలాంటి కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. మీ కారు ఎంత ఎక్కువగా తిరిగితే అంత ఎక్కువగా పాడైపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు కారుని తక్కువగా ఉపయోగించేవారైతే బీమా కూడా తక్కువగా ఉండవచ్చు. ఇది బీమా కంపెనీ ఒప్పందానికి లోబడి ఉంటుంది.

సాధారణంగా రుణం తీసుకునేటప్పుడు క్రెడిట్ స్కోర్ అవసరం. ఈ రోజుల్లో కొన్ని కార్ ఇన్సూరెన్స్ కంపెనీలు కారు ప్రీమియం లేదా రెన్యూవల్ మొత్తాన్ని నిర్ణయించడానికి క్రెడిట్‌ స్కోరు చూస్తున్నారు. దీని కారణంగా మీ క్రెడిట్ స్కోర్ ఎప్పుడూ 750 స్థాయి కంటే తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త కారు దొంగిలించే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ప్రీమియం రేటు ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా ప్రమాదం జరిగిన తర్వాత కొత్త కారు మరమ్మతులకు ఎక్కువ ఖర్చవుతుంది. కానీ పాత కారును పునరుద్ధరించడానికి తక్కువ సమయం పడుతుంది. దీని ఆధారంగా కూడా బీమా పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.

కారు డ్రైవర్‌పై ఆధారపడి కూడా కారు పరిస్థితి ఉంటుంది. అనుభవం ఉన్నవారైతే పర్వాలేదు కానీ కొత్తవారైతే ఇన్సూరెన్స్‌ పెంచడం లేదా తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు డ్రైవర్‌ను నియమించుకున్నట్లయితే సురక్షితమైన డ్రైవర్‌ని ఎంచుకోవడం మంచిది. ఇది మీ కారుకు నష్టాన్ని తగ్గిస్తుంది. బీమాను కూడా తక్కువ ఖర్చుతో పునరుద్దరించవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories