Jahnavi Mehta: రూ. 4 వేల కోట్ల‌కు అధిప‌తి ఈ బ్యూటీ.. ఇంత‌కీ స్టార్ కిడ్ ఎవ‌రంటే

Jahnavi Mehta
x

Jahnavi Mehta: రూ. 4 వేల కోట్ల‌కు అధిప‌తి ఈ బ్యూటీ.. ఇంత‌కీ స్టార్ కిడ్ ఎవ‌రంటే

Highlights

Jahnavi Mehta: ఆ స్టార్ కిడ్ మ‌రెవ‌రో కాదు బాలీవుడ్ ప్రముఖ నటి జుహీ చావ్లా కుమార్తె జాన్వీ మెహతా.

Jahnavi Mehta: చాలా మంది స్టార్ కిడ్స్ తమ తల్లిదండ్రుల మాదిరిగా సినీ రంగంలో అడుగుపెడతారు. అయితే కొందరు మాత్రం దానికి భిన్నంగా సొంత గుర్తింపు కోసం ప‌ర‌త‌పిస్తుంటారు. త‌మ‌కు న‌చ్చిన రంగంలో ముందుకు సాగాల‌ని కోరుకుంటారు. ఈ జాబితాలోకి వ‌స్తుంది పైన ఫొటోలో క‌నిపిస్తున్న బ్యూటీ. ఇంత‌కీ స్టార్ కిడ్ ఎవ‌రంటే.

ఆ స్టార్ కిడ్ మ‌రెవ‌రో కాదు బాలీవుడ్ ప్రముఖ నటి జుహీ చావ్లా కుమార్తె జాన్వీ మెహతా. చిన్నప్పటి నుంచే చదువుల్లో ప్రతిభ చూపిన జాన్వీ, అమెరికాలోని కోలంబియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. సినిమాల్లోకి రావాలన్న ఆలోచన లేకుండా, తాను ఆసక్తి ఉన్న బిజినెస్, స్పోర్ట్స్ రంగాల్లో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఇంటి నుంచి వచ్చిన వ్యాపార నేపథ్యం, తల్లి జుహీ చావ్లా బిజినెస్ అనుభవంతో కలిసి జాన్వీకి మంచి మార్గం ఏర్పడింది.

జుహీ చావ్లా ఇప్పటికే IPL ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కి కో ఓనర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో జాన్వీ మెహతా కూడా KKR బిజినెస్ బాధ్యతల్లో భాగస్వామిగా మారింది. 2022 IPL వేలంలో మొదటిసారిగా ఆమె పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది.

తర్వాత 2025 వేలంలో మళ్లీ పాల్గొంది. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్, కుమార్తె సుహానాతో కలిసి వేదికపై కనిపించిన జాన్వీ, యువతలో బిజినెస్ ప్రతిభను చాటిచెప్పింది. ప్రస్తుతం ఆమె వయసు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే.

అంతకుమించి, హురున్ రిచ్ లిస్ట్ 2024 ప్రకారం జుహీ చావ్లా నికర ఆస్తి రూ. 4,600 కోట్లుగా అంచనా. మెహతా గ్రూప్ బిజినెస్ విలువ కూడా సుమారు రూ. 4 వేల కోట్లుగా ఉంది. ఇలా 22 ఏళ్ల వ‌య‌సులోనే జాన్వీ వేలకోట్ల ఆస్తుల వారసురాలిగా ఎదిగింది.



Show Full Article
Print Article
Next Story
More Stories