ఈ పెన్షన్ పథకంలో చేరండి.. రిటైర్మెంట్‌ తర్వాత నిలకడైన ఆదాయం పొందండి..!

Join Atal Pension Yojana get a Pension of Rs 5000 per Month
x

ఈ పెన్షన్ పథకంలో చేరండి.. రిటైర్మెంట్‌ తర్వాత నిలకడైన ఆదాయం పొందండి..!

Highlights

Pension Money: ఈ ప్రభుత్వ పథకం సామాన్యులకి ఎంతగానో ఉపయోగపడుతుంది.

Pension Money: ఈ ప్రభుత్వ పథకం సామాన్యులకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అటల్ పెన్షన్ యోజన కింద ప్రభుత్వం 60 సంవత్సరాల తర్వాత నెలకు 1000 నుంచి 5000 రూపాయల పెన్షన్‌కి హామీ ఇస్తుంది. ఒక వ్యక్తికి ఏటా రూ.60,000 పింఛను కచ్చితంగా వస్తుందని స్పష్టం చేసింది. అటల్ పెన్షన్ యోజన కోసం రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి దాని ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. ఈ పెన్షన్ పథకంలో మీరు పెట్టుబడి పెట్టిన మొత్తానికి బదులుగా ప్రభుత్వం 60 సంవత్సరాల తర్వాత పెన్షన్ ఇస్తుంది.

ఈ పథకం కింద ప్రతి నెలా ఖాతాలో ఫిక్స్‌డ్ కంట్రిబ్యూషన్ చేస్తే రిటైర్మెంట్‌ తర్వాత నెలకు రూ.1 వేయి నుంచి రూ.5 వేల వరకు పెన్షన్ పొందవచ్చు. ప్రస్తుత నిబంధనల ప్రకారం..18 ఏళ్ల వయస్సులో నెలవారీ పెన్షన్ కోసం మీరు ప్రతి నెలా రూ.210 చెల్లించాలి. ఇదే డబ్బును మూడు నెలలకు ఒకసారి ఇస్తే రూ.626.. ఆరు నెలల్లో రూ.1,239 ఇవ్వాల్సి ఉంటుంది. నెలకు రూ.1,000 పింఛను పొందేందుకు మీరు 18 సంవత్సరాల వయస్సులో నెలకు రూ.42 చెల్లిస్తే చాలు.

మీరు 35 సంవత్సరాల వయస్సులో 5 వేల పింఛను కోసం చేరినట్లయితే 25 సంవత్సరాలకు మీరు ప్రతి 6 నెలలకు రూ.5,323 డిపాజిట్ చేయాలి. ఈ సందర్భంలో మీ మొత్తం పెట్టుబడి రూ. 2.66 లక్షలు అవుతుంది. ఆ మొత్తంపై మీకు నెలకు రూ. 5000 పెన్షన్ లభిస్తుంది. మరోవైపు మీరు 18 ఏళ్ల వయస్సులో చేరినట్లయితే మీ మొత్తం పెట్టుబడి రూ.1.04 లక్షలు మాత్రమే అవుతుంది. పెద్దవారైతే అదే పెన్షన్ కోసం దాదాపు రూ.1.60 లక్షలు ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది.

మీరు చెల్లింపు, నెలవారీ త్రైమాసిక, అర్ధ వార్షిక 3 రకాల ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. ఇది ఆదాయపు పన్ను సెక్షన్ 80 CCD కింద పన్ను మినహాయింపు ఉంటుంది. సభ్యుని పేరు మీద 1 పెన్షన్ ఖాతా మాత్రమే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సభ్యుడు 60 ఏళ్లకు ముందు లేదా ఆ తర్వాత మరణిస్తే అతని భార్యకు పెన్షన్ అందుతుంది. సభ్యుడు, భార్య ఇద్దరూ మరణిస్తే వారి నామినీకి ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories