JioStar: జియో సంచలనం.. దేశంలోనే అతిపెద్ద ఓటీటీగా జియోస్టార్

JioStar
x

JioStar: జియో సంచలనం.. దేశంలోనే అతిపెద్ద ఓటీటీగా జియోస్టార్

Highlights

JioStar: భారతదేశంలో డిజిటల్ విప్లవం ఎంత వేగంగా దూసుకుపోతుందో చెప్పడానికి జియోస్టార్ సాధించిన విజయమే ఒక ఉదాహరణ. ఐపీఎల్ 2025 ఒక కొత్త చరిత్రను సృష్టించింది.

JioStar: భారతదేశంలో డిజిటల్ విప్లవం ఎంత వేగంగా దూసుకుపోతుందో చెప్పడానికి జియోస్టార్ సాధించిన విజయమే ఒక ఉదాహరణ. ఐపీఎల్ 2025 ఒక కొత్త చరిత్రను సృష్టించింది. ఏకంగా 1.19 బిలియన్ (119 కోట్లు) మంది ప్రేక్షకులు, 514 బిలియన్ (51,400 కోట్లు) నిమిషాల వాచ్ టైమ్‌తో లైవ్ స్పోర్ట్స్ విషయంలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. అయితే, ఈ గణాంకాల వెనుక ఒక పెద్ద ప్లాన్ ఉంది. కేవలం క్రికెట్‌కు మించి ఆలోచించడమే దీని విజయ రహస్యం అని జియోస్టార్ స్పోర్ట్స్, లైవ్ ఎక్స్‌పీరియన్స్ సీఈఓ సంజోగ్ గుప్తా చెబుతున్నారు.

బాలీలో జరిగిన APOS 2025 సమ్మిట్‌లో సంజోగ్ గుప్తా మాట్లాడుతూ.. జియోస్టార్ గత 15 ఏళ్లుగా కేవలం స్పోర్ట్స్ రైట్స్‌ను కొనడమే కాకుండా, 500 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.4,000 కోట్లకు) పైగా మొత్తాన్ని ఒక పటిష్టమైన డిజిటల్ స్పోర్ట్స్ ఈకోసిస్టమ్‌ను తయారు చేయడానికి ఖర్చు చేసిందని వెల్లడించారు. దీని ఫలితంగానే టాటా ఐపీఎల్ 2025 భారతదేశంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్ట్‌గా అవతరించడమే కాకుండా, అత్యధిక ఆదాయాన్ని ఆర్జించిన ఈవెంట్‌గా కూడా నిలిచింది.

ఈ సీజన్‌లో 425కు పైగా బ్రాండ్‌లు జియోస్టార్‌తో జతకట్టాయి. వీటిలో 270 బ్రాండ్‌లు ఐపీఎల్‌లో మొదటిసారిగా ప్రకటనలు ఇచ్చాయి. ఈ బ్రాండ్‌లు 40 వేర్వేరు రంగాలకు చెందినవి. జియోస్టార్, నీల్సన్ ద్వారా 32 బ్రాండ్‌ల కోసం థర్డ్-పార్టీ మెజర్‌మెంట్ కూడా ప్రారంభించింది. దీనివల్ల ప్రకటనలు మరింత పారదర్శకంగా మారాయి.

ఐపీఎల్‌కు డిజిటల్ వేదికగా మారిన జియోహాట్‌స్టార్ ఇప్పుడు 30 కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లతో దూసుకుపోతోంది. ఈ సీజన్‌లో 104 కోట్ల యాప్ డౌన్‌లోడ్‌లు నమోదయ్యాయి. మొబైల్ ద్వారా చూసిన ప్రేక్షకుల సంఖ్య 41.7 కోట్లకు చేరింది. కనెక్టెడ్ టీవీ (CTV)లో 23.5 కోట్ల మంది ఐపీఎల్ చూశారు. ఐపీఎల్ 2025 ఫైనల్‌ను ఒక్కసారిగా 42.6 కోట్ల మంది చూశారు. ఇందులో 18.9 కోట్లు టీవీలో, 23.7 కోట్లు డిజిటల్‌లో వీక్షించారు. ఒకేసారి అత్యధికంగా 5.52 కోట్ల మంది లైవ్ చూశారు.

ఐపీఎల్ జియోస్టార్‌కు ప్రధాన ఈవెంట్ అయినప్పటికీ, వారు ఇతర క్రీడలను కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ వీక్షకుల సంఖ్య గత 5 సంవత్సరాల్లో 3.5 రెట్లు పెరిగింది. దీనికి ముఖ్యంగా ప్రాంతీయ భాషల్లో ఫీడ్‌ కూడా ఓ కారణం. అలాగే, కబడ్డీని ఏడాది పొడవునా జరిగే ఈవెంట్‌గా అభివృద్ధి చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories