Housing Crisis: మధ్యతరగతికి భారీ షాక్.. నగరాల్లో ఇల్లు కొనడం ఇక కష్టమే

Housing Crisis
x

Housing Crisis: మధ్యతరగతికి భారీ షాక్.. నగరాల్లో ఇల్లు కొనడం ఇక కష్టమే

Highlights

Housing Crisis: నగరాల్లో ఉద్యోగం చేసే మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇల్లు అనేది ఒక పెద్ద కల. కానీ, ఇప్పుడు ఆ కల నెరవేర్చుకోవడం చాలా కష్టంగా మారింది.

Housing Crisis: నగరాల్లో ఉద్యోగం చేసే మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇల్లు అనేది ఒక పెద్ద కల. కానీ, ఇప్పుడు ఆ కల నెరవేర్చుకోవడం చాలా కష్టంగా మారింది. ఎందుకంటే, మన సంపాదనతో పోలిస్తే ఇళ్ల ధరలు రెట్టింపు అయ్యాయని తాజాగా విడుదలైన ఒక నివేదిక (ఫినాలజీ రీసెర్చ్ డెస్క్) చెబుతోంది. 2020 నుంచి 2024 మధ్య వారి ఆదాయం 5.4శాతం పెరిగితే, ఇళ్ల ధరలు మాత్రం ఏకంగా 9.3శాతం పెరిగాయి. అంటే, సంపాదన కంటే ఇళ్ల ధరలు వేగంగా దూసుకుపోతున్నాయి.

కోటి రూపాయలలోపు ఉండే అఫోర్డబుల్ ఇళ్ల సంఖ్య దేశవ్యాప్తంగా బాగా తగ్గిపోయింది. 2022లో 3.1 లక్షల యూనిట్లు ఉంటే, 2024 నాటికి అవి 1.98 లక్షల యూనిట్లకు పడిపోయాయి. హైదరాబాద్‌లో (69%), ముంబైలో (60%), ఢిల్లీలో (45%) ఈ తగ్గుదల మరీ ఎక్కువగా ఉంది.

బిల్డర్లు ఎక్కువ లాభాలు ఆశించి లగ్జరీ ఇళ్ల నిర్మాణంపైనే దృష్టి పెడుతున్నారు. అలాగే, సర్కిల్ రేట్, మార్కెట్ రేట్ మధ్య తేడాను అడ్డం పెట్టుకుని కొంత డబ్బును నగదు రూపంలో తీసుకుంటున్నారు. ఇది మధ్యతరగతికి భారం. మరో కారణం, తక్కువ FSI (ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్). అంటే, ఒక స్థలంలో ఎంత నిర్మాణం చేయవచ్చో తెలిపేది. మన దేశంలో ఇది తక్కువగా ఉండటం వల్ల పెద్ద బిల్డింగ్‌లు నిర్మించలేకపోతున్నారు.

సర్కిల్ రేట్లను తరచుగా మార్చడం, రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో పారదర్శకత పెంచడం, కొత్త నగరాలు నిర్మించడం, ఖాళీగా ఉన్న ఇళ్లపై పన్నులు వేయడం వంటి చర్యలు తీసుకుంటేనే ఈ సమస్యకు కొంతవరకు పరిష్కారం లభిస్తుంది. లేకపోతే, సొంత ఇంటి కల నిజంగానే కలగా మిగిలిపోతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories