Investing SIP: సిప్‌లో మొదటిసారి ఇన్వెస్ట్‌ చేస్తున్నారా.. ఈ పొరపాట్లు చేయవద్దు..!

Investing in SIP for the First Time Dont Make These Mistakes
x

Investing SIP: సిప్‌లో మొదటిసారి ఇన్వెస్ట్‌ చేస్తున్నారా.. ఈ పొరపాట్లు చేయవద్దు..!

Highlights

Investing SIP: ఈ రోజుల్లో చాలామంది సిప్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. ఫిబ్రవరిలో సిప్‌ ద్వారా రూ.19,186.58 కోట్లుపెట్టుబడి పెట్టారు.

Investing SIP: ఈ రోజుల్లో చాలామంది సిప్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. ఫిబ్రవరిలో సిప్‌ ద్వారా రూ.19,186.58 కోట్లుపెట్టుబడి పెట్టారు. మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. సిప్‌ చేయడం ద్వారా పెద్ద మొత్తం సంపాదించవచ్చని ఎక్కువ మంది నమ్ముతున్నారు. మీరు కూడా సిప్‌లో ఇన్వెస్ట్‌ చేయాలని ఆలోచిస్తున్నట్లయితే కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోండి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

రీసెర్చ్‌, సలహా లేకుండా సిప్‌లో ఇన్వెస్ట్ చేయవద్దు

సిప్‌లో డబ్బును పెట్టుబడి పెట్టడానికి ముందు దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. నిపుణుల నుంచి సలహా తీసుకోవచ్చు. ఈ రెండు పనులు చేయకుండా గుడ్డిగా వెళ్లి ఇన్వెస్ట్‌ చేయకూడదు.

మంచి రాబడి చూసిన సిప్‌ చేయకూడదు

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి గణనీయంగా పెరిగింది. కాబట్టి తెలివిగా ఇన్వెస్ట్ చేయాలి. ఒకదానిలో వచ్చిన రాబడిని చూసి సిప్‌ చేయకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు మంచి రాబడిని ఇచ్చే సిప్‌లు నష్టాలను కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి.

సిప్‌ని ఆపివేస్తూ కొనసాగించవద్దు

నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇన్వెస్టర్లు ఎప్పటికప్పుడు సిప్‌ని ఆపేస్తూ మరికొన్నిసార్లు ప్రారంభిస్తూ ఉంటారు. దీనివల్ల పెట్టుబడిదారులు పూర్తి ప్రయోజనం పొందలేరు. అంతేకాకుండా నష్టాలను కూడా చవిచూడాల్సి వస్తుంది.

ఒకే పథకంలో పెట్టుబడి పెట్టవద్దు

మీరు వివిధ ఫండ్‌లు, రంగాల్లో సిప్‌ చేయాలి. ఒక్కదానిలో మొత్తం ఇన్వెస్ట్‌ చేయడం వల్ల నష్టం వస్తే కోలుకోలేరు. అందుకే రకరకాల దాంట్లో ఇన్వెస్ట్‌ చేస్తూ ఉండాలి.

ఇన్వెస్ట్‌ అమౌంట్‌

సిప్‌లో పెట్టుబడి పెట్టే మొత్తం తక్కువగా ఉండకూడదని గుర్తుంచుకోండి. ఇది మీ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ టాలరెన్స్ ప్రకారం ఉండాలి. తక్కువ డబ్బు పెట్టుబడి పెట్టినట్లయితే మీకు మంచి రాబడి రాదు.

SIPని ఎలా ప్రారంభించాలి

మీరు మొదటిసారి సిప్‌ని ప్రారంభించాలనుకుంటే ముందుగా బ్రోకరేజ్ యాప్‌ని ఎంచుకోవాలి. తర్వాత కేవైసీ ఫార్మాలిటీలను పూర్తి చేయాలి. కొత్త అకౌంట్‌ను కోసం అప్లికేషన్‌ ఫారమ్‌ను నింపాలి. తర్వాత మాత్రమే మీరు సిప్‌లో డబ్బును ఇన్వెస్ట్‌ చేయవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories